Goa elections: ఒంటరిపోరులో ప్రతిపక్షాలు.. గోవాలో అధికార బీజేపీకి చెక్ పెట్టగలవా? ఇంట్రెస్టింగ్ డిబేట్
గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. గోవాలో అధికారంలో ఉన్న ప్రధాన పార్టీ అయిన బీజేపీతో తలపడటానికి ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపు తున్నాయి. గోవాలో అధికార బీజేపీ ఓడించాలని కాంగ్రెస్ పార్టీ, అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా గోవా ఎన్నికలలో బిజెపిని టార్గెట్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే అన్నట్టుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో బిజెపిని ఓడించడం సాధ్యమవుతుందా అన్న చర్చ స్థానికంగా జరుగుతుంది.

ఎవరికి వారుగా బీజేపీకి సవాల్ విసురుతున్న ప్రతిపక్షాలు
విభజిత విపక్షాలు అధికార బీజేపీకి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గోవాలో భీకర ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. 2022 ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష అనే చెప్పుకోవాలి. 2017లో, 40 సీట్లలో 17 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు బీజేపీ 13 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే, ఓట్ షేర్ పరంగా, 32.48% ఓట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది కాంగ్రెస్ కంటే 4 శాతం ఎక్కువ వోట్ షేర్ తో నిలిచింది . ప్రాంతీయ పార్టీలైన మహారాష్ట్ర వాదీ గోమాంతక్ పార్టీ మూడు స్థానాలు, గోవా ఫార్వర్డ్ పార్టీ మూడు స్థానాలను గెలుచుకొని 2017 లో గోవాలో అధికార పార్టీ నిర్ణయించే స్థాయిని దక్కించుకున్నాయి. ముగ్గురు స్వతంత్రులు కూడా అప్పుడు గెలిచి గోవాలో అధికార పార్టీని నిర్ణయించడంలో కింగ్ మేకర్లు గా మా

కలిసికట్టుగా ప్రతిపక్షాలు రంగంలోకి దిగితే బీజేపీకి టెన్షన్ .. కానీ
అధికార బీజేపీని ఓడించటానికి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా బరిలోకి దిగితే బిజెపి ఓటమి సాధ్యమవుతుంది అనేది స్థానికంగా ఉన్న అభిప్రాయం. కానీ ఎవరికి వారు ఎన్నికల బరిలోకి దిగి, ఒక పార్టీ పైవరకు పార్టీ విమర్శలు గుప్పించుకుంటున్న వేళ గోవాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారుగా బీజేపీని నిలువరించగలుగుతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికల తర్వాత గోవాలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది

తాజాగా గోవాలో పార్టీల పరిస్థితి ఇదే
ఫిరాయింపుల తో కాంగ్రెస్ పార్టీ తల్లడిల్లింది. ఇటీవల ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి. ఇక బీజేపీ నుంచి కూడా వలసలు కొనసాగిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకో లేదు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అంతుచిక్కడం లేదు. ఇక ఈ సారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గోవా నుండి ఎన్నికల బరిలోకి దిగడంతో దీన్ని గోవా ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో అర్థం కావడం లేదు.
Recommended Video

విడివిడిగా ఎన్నికల బరిలోకి ... గోవా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు?
లోకల్ పార్టీ అయిన మహారాష్ట్ర వాదీ గోమాంతక్ పార్టీ తో పొత్తు పెట్టుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి వెళుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళుతుంది. ఏది ఏమైనా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు విడివిడిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపద్యంలో గోవా రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, గోవా ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.












Click it and Unblock the Notifications