బీచ్‌లో ఘోరం: రేప్? రక్తపు మడుగులో నగ్నంగా విదేశీ యువతి
ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నంగా పడివుండటం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన గోవాలో చోటు చేసుకుంది.
పనాజీ: ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నంగా పడివుండటం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన గోవాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇటీవల గోవాకు వచ్చింది. వాళ్లిద్దరూ సోమవారం స్థానికంగా జరిగిన హోలీ వేడుకల్లో కూడా పాల్గొన్నారు.
వేడుకల అనంతరం ఆమె కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె మృతదేహం నగ్నంగా బీచ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన స్ధానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఘటపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు ముందు అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. హోలీ వేడుకల్లో ఆమె ఎవరితో సన్నిహితంగా ఉందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
మృతురాలి స్నేహితుడిని కూడా విచారించారు. అతడు తెలిపిన వివరాల మేరకు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని డీసీపీ సమ్మీ టావరేస్ తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications