Goa Polls: మమతాబెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే; గోవాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్!!
2022 సంవత్సరం ప్రారంభంలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ గోవాపై ఫోకస్ పెట్టాయి. అయితే ఈ సమయంలో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగులుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి 17 మంది శాసన సభ్యుల్లో ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. తాజాగా సోమవారం నాడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అలెక్సో రెజినాల్డో లోరెన్కో మంగళవారం కోల్‌కతాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు. దీంతో కాంగ్రెస్ గోవాలో మరింత బలహీనపడింది.
టీఎంసీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లోరెన్కో
కోల్‌కతాకు వెళ్లే ముందు లౌరెన్‌కో సోమవారం గోవా శాసనసభ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అలెక్సో రెజినాల్డో లోరెన్కో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మంగళవారం టీఎంసీ ట్వీట్ చేసింది, మంగళవారం నాడు , టీఎంసీ ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీ, మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్టోరిమ్ మాజీ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లోరెన్కో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. తాము ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలుకుతాము.. అందరం కలిసి గోవా వాసుల అభ్యున్నతి కోసం కృషి చేస్తాము అని టీఎంసీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

గోవాలో తగ్గిన కాంగ్రెస్ బలం .. ఊహించని షాక్ లతో కాంగ్రెస్ కుదేలు
కర్టోరిమ్ అసెంబ్లీ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన లోరెన్కో ఇటీవలే గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. అయినప్పటికీ గోవాలో ఉన్న రాజకీయ పరిస్థితులతో గోవాలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు లేకపోవటంతో ఆయన పార్టీకి రాజీనామా అచేశారు. ఆయన రాజీనామా తర్వాత 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో, కాంగ్రెస్ పార్టీ నుండి 17 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ బలం రెండుకు తగ్గింది. అంతకుముందు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు.

ఇప్పటికే టీఎంసీ తీర్ధం పుచ్చుకున్న మాజీ సీఎం లుయిజిన్హో ఫలేరో
ఈ నెల ప్రారంభంలో, గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం క్రితం, మాజీ సీఎం లుయిజిన్హో ఫలేరో కూడా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత వారం రాబోయే ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులతో మొదటి జాబితాను కూడా ప్రకటించింది. అందులో లోరెన్కో పేరు కూడా ఉంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2022లో జరగనున్నాయి. తీర ప్రాంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన టి.ఎం.సి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
గోవాలో బీజేపీపై దీదీ మమతా బెనర్జీ వార్
గోవా ఎన్నికల ద్వారా బీజేపీని సమర్ధంగా ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేస్తుంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. గోవాకు సీఎం కావటానికి రాలేదని, గోవా ప్రజల అభివృద్ధి కోసం తాము గోవా ఎన్నికల్లో పోటీలో ఉంటామని ఇప్పటికే మమతా బెనర్జీ వెల్లడించారు అంతేకాదు బీజేపీకి బుద్ధి చెప్పాలి అనుకునే వారు ఎవరైనా సరే తమ పార్టీతో కలిసి పోరాటం చెయ్యొచ్చు అని మమతా బెనర్జీ కలిసొచ్చే పార్టీలకు సూచించారు. ఇప్పటికే గోవాలో బీజేపీ మిత్రపక్ష పార్టీ అయిన మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీకి షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ.












Click it and Unblock the Notifications