వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేకను అరెస్టు చేసి లాకప్‌లో పెట్టారు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేస్తారని మరో సారి నిరూపించారు. మేకను అరెస్టు చేసి తీసుకు వెళ్లి లాకప్ లో పెట్టారు. లాకప్ లో మేక గోల చెయ్యకుండ ఉండటానికి గడ్డి పెట్టారు. అది తాగడానికి నీళ్లు పెట్టారు.

వివరాలల్లోకి వెళితే మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక గ్రామంలో దొంగలుపడ్డారు. ఆ గ్రామంలో వందల సంఖ్యలో గొర్రెలు, మేకలు, కోళ్లు ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

దొంగలను పట్టుకోవడానికి వేట మొదలు పెట్టారు. చట్టుపక్కల గ్రామాలలో గాలించారు. ఆ సందర్బంలో పోలీసులకు ఒక ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్న ఒక బుజ్జి మేక కనపడింది. ఆ మేకను ఎత్తుకొచ్చారని పోలీసులకు అనుమానం వచ్చింది.

Goat Finds Itself in a Police Lock-Up Parbhani district in Maharashtra

ఇంటి యజమానిని ప్రశ్నించారు. అయితే అతను మొదట పోలీసులతో వాదించాడు. పోలీసులు అతనికి బెండ్ తియ్యడంతో మేకను ఎత్తుకోచ్చామని అంగీకరించాడు. అంతే పోలీసులు అతనిని, మేకను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు.

మేక యజమాని సరైన సమాచారం ఇవ్వాలని, కొన్ని సాక్ష్యాలు చూపించి దీన్ని తీసుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇటివల బండ బూతులు తిడుతుందని ఒక చిలుకను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిలుకను అటవి శాఖ అధికారులకు అప్పగించారు.

English summary
The goat was apparently 'seized' after a complaint of cattle theft was registered at the Pathri police station in Parbhani on August 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X