ఆ దేవుడే చెప్పాడు: కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడంపై దిగంబర్ కామత్
పనాజీ: కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన సీనియర్ ఎమ్మెల్యే దిగంబర్ కామత్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామత్ తోపాటు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద వారు "విధేయత ప్రతిజ్ఞ" తీసుకున్న ఏడు నెలల తర్వాత, గోవాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది అధికార బీజేపీలో చేరారు.
ఎన్నికల తర్వాత తాము మారబోమని ఓటర్లను, పార్టీ నాయకత్వాన్ని ఒప్పించాలనే ఆశతో వారు రాహుల్ గాంధీ సమక్షంలో ప్రమాణం కూడా చేశారు. ఫిరాయింపులకు నాయకత్వం వహించిన దిగంబర్ కామత్.. తాను, మిగిలిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి ముందు దేవుని అనుమతి తీసుకున్నారని, "దేవుడు అంగీకరించాడు" అని అన్నారు.

తాను దేవుడిని నమ్ముతానని, ఎన్నికల ముందు తాము కాంగ్రెస్‌ను వీడబోమని ప్రమాణం చేసిన మాట వాస్తవమేనని గోవా మాజీ ముఖ్యమంత్రి అన్నారు. కానీ, మళ్లీ గుడికి వెళ్లి ఏం చేయాలని దేవుడిని అడిగాను.. మీకు ఏది మంచి అయితే అది చేయమని దేవుడు చెప్పాడని మీడియాతో అన్నారు.
2017లో గోవాలోని 40 స్థానాలకు గాను 17 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ ఒంటరి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ 13 స్థానాల్లో గెలిచి చిన్న పార్టీలు, స్వతంత్రుల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకుంది. రెండేళ్ల తర్వాత 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు.
తాజా ఎన్నికల్లో, ఫలితాలకు ఒకరోజు ముందు కాంగ్రెస్ తన అభ్యర్థులను రిసార్ట్‌లో ఉంచింది. కామత్ ఆ సమయంలో ఫిరాయింపులను "ప్రజాస్వామ్య మరణం" అని అన్నారు. ఇప్పుడు ఆయనే పార్టీ మారడం గమనార్హం.
Goa | I went to a temple, asked Gods & Goddesses that this (joining BJP) is in my mind, what should I do... God said, you go ahead, don't worry: Former Congress MLA Digambar Kamat, after joining BJP (14.09) pic.twitter.com/Nne2X9Q3zI
— ANI (@ANI) September 15, 2022
మరోవైపు, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' (యునైట్ ఇండియా మార్చ్) మధ్యలో సామూహిక ఫిరాయింపు కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. "మొదట మీ పార్టీని జోడో (యునైట్ చేయండి)" అని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
బీజేపీ, దాని మిత్రపక్షాలు ఇప్పటికే గోవాలో 25 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీలో ఉంది. 40 మంది సభ్యుల అసెంబ్లీలో.. బీజేపీకి ఇప్పుడు 33కు ఎమ్మెల్యేల బలం పెరిగింది. ప్రతిపక్షం కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలకు తగ్గింది.












Click it and Unblock the Notifications