కాంగ్రెస్ గెలుపును లాక్కునేందుకు బీజేపీ యత్నం..! వేలాదిగా రోడ్డెక్కిన రైతులు ..!

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్న గోకుల్ మిల్క్ యూనియన్ (Gokul Milk Union) ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా వచ్చిన తీర్పును అనుకూలంగా మార్చుకునేందుకు మహారాష్ట్రలోని ఎన్డీయే సర్కార్ జారీ చేసిన ఆర్డినెన్స్ తో రైతులు భగ్గుమన్నారు. తాము వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, దాన్ని కాలరాసి అడ్డదారిలో గోకుల్ మిల్క్ యూనియన్ ను చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో అక్కడి మహాయుతి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.

సహకార ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ వరుస షాక్ లు- ఈసారి మహారాష్ట్రలో..!
సహకార ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ వరుస షాక్ లు- ఈసారి మహారాష్ట్రలో..!

తాజాగా గోకుల్ మిల్క్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. వీటిని అక్కడి అధికార ఎన్డీయేతో పాటు విపక్ష ఇండియా కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో 25 సీట్లకు గానూ 13 సీట్లను కాంగ్రెస్ పార్టీ నేత సతేజ్ పాటిల్ నేతృత్వంలోని కూటమి గెల్చుకుంది. అధికార మహాయుతి మద్దతిచ్చిన కూటమికి 12 సీట్లే వచ్చాయి. దీంతో గోకుల్ మిల్క్ యూనియన్ ఛైర్మన్ గా సతేజ్ పాటిల్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ ఆయన్ను అడ్డుకునేందుకు ఫడ్నవీస్ సర్కార్ హడావిడిగా ఓ ఆర్డినెన్స్ తెచ్చింది.
ఇందులో నలుగురు ప్రభుత్వ నామినేటెడ్ సభ్యులకు ఛైర్మన్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించింది. దీంతో రైతులు భగ్గుమన్నారు.

Gokul Milk Union Row Thousands of Dairy Farmers Rally in Kolhapur Against Bjp s Voting Rights Move
జెర్రీమాండరింగ్: ట్రంప్ ఓటమి నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన పాఠం..!
జెర్రీమాండరింగ్: ట్రంప్ ఓటమి నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన పాఠం..!

సతేజ్ పాటిల్ ఆధ్వర్యంలో ఇవాళ దాదాపు 40 వేల మందికి పైగా రైతులు కొల్హాపూర్ లో తమ పాడి పశువుల్ని తీసుకొచ్చి మరీ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని, సహకార ఎన్నికల తీర్పును కాలరాసే ప్రయత్నాలను మానుకోవాలని నినదించారు. ఇందులో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ ఇప్పటికే బోంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ బాస్ అభిజీత్ దిప్కే కూడా ట్వీట్ చేశారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ, ఈ 4 అదనపు ఓట్లతో బీజేపీ నేతృత్వంలోని గ్రూప్ మెజారిటీ సాధించి గోకుల్‌ను తమ నియంత్రణలోకి తీసుకోగలిగిందని, ఒక డెయిరీ సహకార సంఘం తీర్పును కూడా దొంగిలించడానికే వీళ్ళు ఇంతగా ఆరాటపడుతుంటే, జ్ఞానేష్ కుమార్ సహాయంతో రాష్ట్ర ఎన్నికలలో ఇంకెందుకలా చేస్తున్నారో ఒక్కసారి ఊహించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+