గోల్డ్ లోన్ కావాలా.. జీరో వడ్డీ తోనే.. కానీ !!

గోల్డ్ లోన్ కావాలా.. జీరో వడ్డీ తోనే.. వినడానికి అదిరిపోయే ఆఫర్ లాగా అనిపిస్తున్నా కానీ.. ఆ మాటలు నమ్మి అడుగేస్తే మాత్రం మనం తీసుకున్న గోతిలో మనం పడ్డట్టే అవుతుంది. కేటుగాళ్లు పూటకే రూపం మారుస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, పెద్ద వ్యాపారవేత్తలు కూడా వీరి బారిన పడుతున్నారు. పోలీసులు అధికారులు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొత్త రకం దోపిడి ఘటనల పట్ల అవగాహన కల్పిస్తున్నా కూడా నేరగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు.

ఒక మోసం గురించి ప్రజలు పూర్తిగా అవగాహన పొందేలోపే, అంతకంటే ప్రమాదకరమైన మరో పద్ధతితో రంగంలోకి దిగుతున్నారు. ఈ కారణంగా సామాన్యుల జీవితాల్లో తీరని నష్టం జరుగుతోంది. అందుకు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన 'వడ్డీ లేని గోల్డ్ లోన్' మోసం ఉదాహరణగా నిలుస్తోంది. కేరళలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటివరకు 30 మందికి పైగా బాధితులను మోసం చేసి రూ.3 కోట్లకు పైగా కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

gold-loan-fraud-case-at-kerala-that-3-crores-from-30-people

వడ్డీ లేకుండా గోల్డ్ లోన్..

సాధారణంగా బంగారం అంటే భద్రతకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. అవసరం వస్తే బ్యాంకుకు వెళ్లి గోల్డ్ లోన్ తీసుకుని.. ఆ తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లించి బంగారం తెచ్చుకోవడం అందరూ చేసే పనే. ఈ విషయాన్నే ఆయుధంగా మార్చుకున్నారు నేరగాళ్లు. "వడ్డీ లేకుండా గోల్డ్ లోన్ ఇస్తాం", "బ్యాంకుల కంటే సులువు", "ఎలాంటి పేపర్ వర్క్ లేదు" అంటూ అమాయకుల్ని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న వ్యాపారులు, అత్యవసర అవసరాల్లో ఉన్న కుటుంబాలే వీరి టార్గెట్ గా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కేరళ లోని కన్నూర్ జిల్లా వడకుంబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కుటుంబ అవసరాల కోసం డబ్బు అవసరమైంది. బ్యాంకుకు వెళ్లాలని అనుకున్న సమయంలో, స్థానికంగా పరిచయమున్న వ్యక్తి మాటలను నమ్మిన ఆమె రూ.2.30 లక్షల లోన్ కోసం 62.300 గ్రాముల బంగారం అప్పగించింది. అంతే కాకుండా ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.1.25 లక్షలు నగదుగా కూడా ఇచ్చింది. మొదట్లో మాటలతో నమ్మించిన ఆ వ్యక్తి.. కొద్దిరోజులకే ఫోన్లు ఎత్తడం మానేయడంతో చివరకు బాధితురాలు ధర్మడమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు విచారణ ప్రారంభించగానే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

ఈ మోసం ఒక్క మహిళకే కాకుండా ఇప్పటివరకు 30 మందికి పైగా బాధితులు, మొత్తం మోసపు విలువ రూ.3 కోట్లకు పైగా అని తేలింది. మహ్మద్ షిబిల్ అనే వ్యక్తి ఓ సంస్థ పేరుతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడే కంపెనీ యజమానుల్లో ఒకడిగా ఉండగా.. మరో నలుగురు సహచరులతో కలిసి గోల్డ్ లోన్ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు మిగతా నలుగురిని అరెస్ట్ చేసి, బంగారం ఎక్కడికి తరలించారన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదని.. కేరళలోని కోజికడ్ జిల్లాలో కూడా ఇలాంటి గోల్డ్ లోన్ మోసాలకు పాల్పడిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వడ్డీ లేకుండా గోల్డ్ లోన్ ఇస్తామంటే అనుమానించాలని.. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన బ్యాంకులు, NBFCలకే బంగారం తాకట్టు పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి రసీదు, డాక్యుమెంట్ లేకుండా బంగారం ఇవ్వకూడదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+