వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లేజర్ లో బంగారం: ఎయిర్ పోర్ట్ లో 10 కేజీల గోల్డ్ సీజ్

|
Google Oneindia TeluguNews

కోచ్చి: గుట్టు చప్పుడు కాకుండ అక్రమంగా బంగారం తరలిస్తున్న విదేశీయుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అయితే అతను కేవలం బంగారం తరలిస్తున్నాడని, అతని వెనుక బడా స్మగ్లర్లు ఉన్నారని అధికారులు అంటున్నారు.

మంగళవారం మద్యాహ్నాం దుబాయ్ నుండి కేరళలోని కోచ్చికి ఎమిరేట్స్ విమానం వచ్చింది. అదే విమానంలో ఐర్లాండ్ జాతీయుడు ఆండ్రూ ప్రయాణించాడు. ఎయిర్ పోర్టు అధికారులు ఆండ్రూ తీసుకు వెలుతున్న లగేజ్ క్షుణ్ణంగా పరిశీలించారు.

Gold Smuggler arrested in Kochi Airport

లగేజ్ లో అధికారులకు ఎలాంటి స్మగ్లింగ్ వస్తువులు కనపడలేదు. అయితే ఆండ్రూ ప్రవర్తన మీద అధికారులకు అనుమానం వచ్చింది. అయితే అతను వేసుకున్న బ్టేజర్ ను పరిశీలించారు. అంతే అధికారుల కళ్లు చెదిరిపోయాయి.

అతను వేసుకున్న బ్లేజర్ లో ఒక కేజీ బరువు ఉన్న 10 బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. బ్లేజర్ లోని జాకెట్ లో అతను బంగారం దాచి పెట్టి బయటకు తరలించడానికి ప్రయత్నించాడని గుర్తించి అరెస్టు చేశారు. అతని వెనుక ఉన్న సూత్రదారులను అరెస్టు చెయ్యడానికి అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.

English summary
Customs officials at Kochi airport seized nearly 10 kg of smuggled gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X