పెద్ద మొత్తంలో బంగారం లూటీ: విలువ రూ. 16 కోట్లకు పైమాటే..!
ముంబై: ముంబై-ఆగ్రా జాతీయ రహదారిలో శుక్రవారం తెల్లవారుజామన భారీ దోపిడి జరిగింది. మరణాయుధాలతో బెదిరించి 58 కిలలో బంగారాన్ని దోచుకుపోయారు. దీని విలువ సుమారు రూ. 16 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
జీ గోల్డ్ కంపెనీకి చెందిన వాహనంలో సుమారు 58 కిలోల బంగారాన్ని శుద్ధీకరణ నిమిత్తం ధూలే జిల్లా శిర్ పూర్‌కు తరలిస్తున్నారు. మార్గమధ్యలో ముంబై-ఆగ్రా రహదారిలోని వడివరే గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో, మారణాయుధాలతో బెదిరించి వాహనాన్ని అడ్డుకున్నారు.

ప్యాకింగ్ చేసి ఉన్న బంగారాన్ని దోచుకోని పారిపోయారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో తనిఖీలు ముమ్మరం చేశారు.
వాహనం డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రైవర్ చెప్పిన వివరాల మేరకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి సంజయ్ మోహితే తెలిపారు. ఇక జీ గోల్డ్ కంపెనీ వాహనంలో సీసీటీవి కెమెరాలు ఉండటంతో వాటి పుటేజీలను పరిశీలిస్తే దుండగులు ఆచూకీ లభించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications