వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ దిగ్భ్రాంతి.. లోకేశ్ సానుభూతి.. సుశాంత్ మరణం నేపథ్యంలో సంచలన రిపోర్ట్.. హెల్ప్ లైన్లు..

|
Google Oneindia TeluguNews

స్టార్ హీరో ఇమేజ్.. చేతినిండా సినిమాలు.. అడిగినంత డబ్బులిచ్చే నిర్మాతలు.. దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగళా.. కొన్ని ప్రేమలు.. ఇంకా 35 కూడా దాటని వయసు.. ఇవేవీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకోలేకపోయాయి. ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకోడానికి ముందు.. బాలీవుడ్ కే చెందిన ఓ స్నేహితుడికి సుశాంత్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అదే ఫోన్ కాల్ హెల్ప్ లైన్ నంబర్ కుగానీ చేసుంటే సీన్ మరోలా ఉండేది. సుశాంత్ మరణం నేపథ్యంలో ఆత్మహత్యలకు సంబంధించిన కీలక రిపోర్టులు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ఆత్మహత్య నివారణ కోసం పనిచేసే హెల్ప్ లైన్ల నంబర్లు వైరల్ అయ్యాయి.

అమ్మా..మనిద్దరమూ తప్పే అనిపిస్తోంది.. చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో సుశాంత్.. డిప్రెషన్ లో చివరి పోస్టుఅమ్మా..మనిద్దరమూ తప్పే అనిపిస్తోంది.. చనిపోయిన తల్లి జ్ఞాపకాల్లో సుశాంత్.. డిప్రెషన్ లో చివరి పోస్టు

ప్రధాని దిగ్భ్రాంతి..

ప్రధాని దిగ్భ్రాంతి..

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అతని మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న యువ నటుడు ఇంత చిన్న వయసులోనే వెళ్లిపోయాడని మోదీ ఆవేదన చెందారు. ‘‘తన నటనతో టీవీ, సినిమాల ద్వారా అందరినీ రంజింపజేశాడు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో సుశాంత్ ఎదుగుదల ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. సినిమాల్లో చిరస్మరణీయ ప్రదర్శనలను మనకు మిగిల్చి.. తాను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. ఈ క్లిష్ట సమయంలో సుశాంత్ కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలుపుకుంటున్నా''అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఢిల్లీపై అమిత్ షా ఫోకస్.. మళ్లీ లాక్ డౌన్ పై 17న నిర్ణయం..కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఢిల్లీపై అమిత్ షా ఫోకస్.. మళ్లీ లాక్ డౌన్ పై 17న నిర్ణయం..

కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం..

కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం..

బంద్రాలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతదేహానికి డాక్టర్ ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. సుశాంత్ సోదరి మీనూ సింగ్ ఆస్పత్రికి చేరుకుని ఫార్మాలిటీలు పూర్తిచేశారు. కొడుకు అకాలమరణంతో సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం బాడీని బంధువులు చెప్పిన చోటుకు చేరవేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి..

తెలుగు రాష్ట్రాల నుంచి..

సుశాంత్ మరణంపై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులెందరో స్పందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి సంతాపాలు ప్రకటించినవారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఉన్నారు. బాలీవుడ్ ఓ యువ నటుడిని కోల్పోయిందని .. సుశాంత్ ఆత్మహత్య తీవ్రంగా కలచివేసిందని లోకేశ్ పేర్కొన్నారు. సుశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గుండె బద్దలైంది..

గుండె బద్దలైంది..

యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణం గురించి విన్న తర్వాత గొంతు తడారిపోయిందని, కాసేపటిదాకా మాటలు రాలేదని సీనియర్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. దర్శకుడు అనురాగ్ కాశ్యప్ అయితే ‘ఇది నిజం కాదు..' అని వ్యాఖ్యానించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి గుండె బద్దలైందని, ఇది నిజం కాకపోతే బాగుండని మరో నటుడు సోనూ సూద్ విచారం వెలిబుచ్చారు. కాగా,

ఆత్మహత్యల రిపోర్టు..

ఆత్మహత్యల రిపోర్టు..


34 ఏళ్ల వయసులోనే సుశాంత్ తనువు చాలించాడన్న వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఆత్మహత్యల నిరోధానికి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, ఆత్మ హత్యలపై ప్రచురితమైన పలు రిపోర్టులు సైతం చర్చనీయాంశం అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధ్యయనం ప్రకారం.. భారతదేశ జనాభాలో 6.5 శాతం మంది చాలా తీవ్రమైన మానసిక వ్యాకులతో బాధపడుతున్నారు. ప్రతి లక్షమందిలో యావరేజ్ సూసైడ్ రేటు 10.9గా ఉంది. ఇండియాలో ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వాళ్లలో 44 సంవత్సరాల లోపు వయసున్నవాళ్లే ఎక్కువని రిపోర్టులో పేర్కొన్నారు.

Recommended Video

LOCKDOWN Extension: 16, 17 వ తేదీల్లో CM లతో PM Modi మరోసారి భేటీ ! UNLOCK 1 తెచ్చిన తిప్పలు...
ఇవీ నంబర్లు..

ఇవీ నంబర్లు..

ఈ మధ్య తాను చేసిన ‘చిచోరే' సినిమాలో ఆత్మహత్యలు వద్దంటూ సందేశం ఇచ్చిన సుశాంత్.. చివరికి తానే ఆ పనికి ఒడిగట్టడం విషాదకరం. సుశాంత్ మరణం తర్వాత అన్ని ప్రముఖ వార్తా సంస్థలు కొన్ని హెల్ప్ లైన్ నంబర్లను ప్రచురించాయి. డిప్రెషన్ లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినా.. లేదా మీ స్నేహితులెవరైనా అలాంటి కండిషన్ లో ఉన్నా ‘ఆత్మహత్యా నివారణ' ఎన్జీవోలకు కాల్ చేయాల్సిందిగా పేర్కొన్నాయి. వాటిలో కొన్ని నంబర్లివి.. రోషిణి(హైదరాబాద్)- 040-66202000, స్నేహ(చెన్నై)-044-24640050, ఆసరా(ముంబై)-022-27546669, సుమైత్రి(ఢిల్లీ)-011-23389090.

English summary
Prime Minister Narendra Modi joined the nation today in mourning actor Sushant Singh Rajput. tdp leader nara lokesh and others too extended condolence. Suicide Prevention Helplines related post went viral after actor death news came out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X