దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడకలు
దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు త్యాగాన్ని తలచుకుంటూ క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. లోక రక్షణ కొరకు మరణించిన ఏసు కోసం ఉపవాసాలు ఉన్నారు.
గుడ్ ఫ్రైడే సందర్భంగా హైదరాబాద్‌లో క్రీస్తు నామ స్మరణలు మిన్నంటాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి, బొల్లారం, కూకట్‌పల్లి, సనత్‌నగర్, అబిడ్స్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. జీసస్‌ను బందించడం నుంచి శిలువ వేసే వరకు జరిగిన ఘట్టాలను నాటకం రూపంలో ప్రదర్శించారు.













Click it and Unblock the Notifications