Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పప్పుల ధరలపై సామాన్యులకు కేంద్రం శుభవార్త!

నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే మరొక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పప్పులపై ఉన్న రాయితీని విస్తరించి భారత బ్రాండ్ ద్వారా పప్పులను తక్కువ ధరలకు అందించడానికి చర్యలు తీసుకుంది. కందిపప్పు, శనగ పప్పు, పెసర పప్పు, ఎర్ర పప్పుల ధరలను అందుబాటులోకి తెచ్చే చర్యలు ప్రారంభించింది.

రిటైల్ ధరలకు భారత్ బ్రాండ్ తో బియ్యం, పప్పులు
ఇక ఈ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తృణధాన్యాలు మైసూర్ పప్పులను భారత బ్రాండ్ లో చేర్చింది. భారత్ బ్రాండ్ ను దేశవ్యాప్తంగా కేంద్రం గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రారంభించింది. తొలిదశలో బియ్యం, గోధుమ పిండితో పాటు, పప్పులను రిటైల్ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Good news for the common man on the prices of pulses chana dal and masoor dal in bharat brand

భారత్ బ్రాండ్ రెండవ దశ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రం గుడ్ న్యూస్
అయితే తాజాగా భారత్ బ్రాండ్ రెండవ దశ ప్రారంభోత్సవం సందర్భంగా శనగపప్పు కిలో ధరను 58 రూపాయలు గాను, మైసూర్ పప్పు 89 రూపాయలు గానూ నిర్ణయించింది. ఈ ధరలు మార్కెట్ ధరల కంటే కనీసం 20% నుండి 25% వరకు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ ధరలు బఫర్ స్టాక్ నుండి సబ్సిడీతో అందించబడతాయని కేంద్రం తెలిపింది.

త్వరలోనే రిటైల్ మార్కెట్లో శనగపప్పు, మైసూర్ పప్పు
ప్రభుత్వం సహకార సంఘాలకు మూడు లక్షల టన్నుల శనగపప్పు 68,000 టన్నుల మైసూర్ పప్పులను కేటాయించింది. శనగపప్పు మైసూర్ పప్పు రిటైల్ మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. భారత్ బ్రాండ్ ద్వారా అందించే ఈ నిత్యవసర సరుకులు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, రిటైల్ స్టోర్ లో అందించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు .

ధరలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం నిర్ణయం
విపరీతంగా పెరుగుతోన్న ధరలను నియంత్రించే ప్రయత్నంలో, సామాన్యులకు అందుబాటు ధరలలో నిత్యావసరాలను అందించటంలో భాగంగానే సబ్సిడీపై పప్పులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, మార్కెట్ లో శనగపప్పు రూ.110, మైసూర్ పప్పు రూ.115కు పైనే ఉంది. అమెజాన్, జియోమార్ట్‌తో పాటు బిగ్‌బాస్కెట్, బ్లింకిట్‌లో భారత్ బ్రాండ్ సబ్సిడీ పప్పులను ఆర్డర్ పెట్టుకోవచ్చు.

సహకార సంఘాల ద్వారా రిటైల్ మార్కెట్లో పప్పులు
నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కన్జ్యూమర్ కోపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే సెంట్రల్ రెండు సహకార సంఘాల ద్వారా రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన పప్పులను అందించనున్నాయి. ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+