ఆయుష్మాన్ భవ.. అన్ని రాష్ట్రాలకు అదిరిపోయే ఆదేశమిచ్చిన మోడీ ప్రభుత్వం!
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద లబ్ధిదారులకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తారు. అయితే తప్పనిసరిగా ఆయుష్మాన్ కార్డును కలిగి ఉండాలి .
వారికి గుడ్ న్యూస్ చెప్పిన మోడీ సర్కార్
ఈ కార్డు ఉన్నప్పుడు ఏదైనా ఆసుపత్రిలో ఉచిత చికిత్సను పొందేందుకు వీలు కల్పించబడుతుంది. అయితే భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం నిరుపేదలకు ఆరోగ్య భీమాను అందిస్తున్న క్రమంలో తాజాగా 70 ఏళ్ళు, ఆపై వయసు పైబడిన వారందరికీ కూడా వర్తింపజేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు దీనికి సంబంధించి మరో శుభవార్తను చెప్పింది.

రాష్ట్రాలకు ఆదేశం
ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ప్రయోజనాలను కల్పించడానికి సీనియర్ సిటిజన్లకు అవకాశం కల్పించిన కేంద్రంలోని మోడీ సర్కార్ అర్హుల పేర్లను నమోదుచేసే ప్రక్రియను ప్రారంభించాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ ఎస్ చాంగ్సన్ లేఖ రాశారు. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు నమోదుకు ఆయుష్మాన్ మొబైల్ యాప్ లోను, వెబ్సైట్లోనూ ప్రత్యేకవిభాగం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
వారికోసం నిరంతరాయ ప్రక్రియ
ఈ ప్రక్రియ ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం అప్లై చేసుకున్న సీనియర్ సిటిజన్స్ కు కార్డులు జారీ చేస్తామని ఇక ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, త్వరలోనే సీనియర్ సిటిజన్లకు ఈ పథకం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ క్రింద అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి .అయితే ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోని వారికి, ఈ పథకంలో లేనివారికి కూడా నమోదుకు అవకాశం కల్పిస్తోంది.
వారంతా అర్హులే.. మరో కీలక నిర్ణయం దిశగా కేంద్రం
సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా 70 ఏళ్ళు ఆపైన వయసు వారందరూ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవడానికి అర్హులేనని పేర్కొంది. ఇక ఇదే సమయంలో 10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్య చికిత్సలను అందించాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం. దసరా పండుగ వేళ మోడీ సర్కార్ వేస్తున్న కీలక అడుగులు సీనియర్ సిటిజన్ లకు సంతోషం కలిగిస్తుంది.
వారికి ఆయుష్మాన్ భారత్ కార్డులతో ఆరోగ్య రక్షణ
ఇక సీనియర్ సిటిజన్ లు ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం నమోదు చేసుకోవాలనుకుంటే వారికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ ఆధారిత ఈకేవైసీ చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ కార్డులు జారీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి సీనియర్ సిటిజన్ లకు ఆయుష్మాన్ కార్డులతో మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే ఈ పథకం వారికి అమలు చేయనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అర్హుల పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications