శుభవార్త.. ఒక్కరోజులోనే వీసా, వారికి ఒక్క నిముషంలోనే ఇమిగ్రేషన్ క్లియరెన్స్!

భారతదేశంలో వీసా జారీపైన కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు వీసా జారీ చేయడానికి కొన్ని వారాల సమయం పట్టేది. కానీ ఇకపై అన్ని పత్రాలు సమర్పిస్తే ఒక్క రోజులోనే వీసాను పొందే అవకాశాన్ని కల్పించేందుకు కేంద్రప్రభుత్వం నిబంధనల్లో వెసులుబాటు తీసుకొచ్చింది. అక్రమ వలసదారులు, గడువుమించి ఉండే విదేశీయులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్, ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్ అనే రెండు కొత్త పోర్టల్స్ ను ప్రారంభించింది.

వీసాల విధానాలపై చర్చించిన బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో విదేశీ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీసాల విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణ వంటి అంశాలపై కీలక చర్చ జరిపారు. ఈ సందర్బంగా ఆయా అంశాల్లో పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. వీసా విధానాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Good news Visa in one day in india immigration clearance in one minute for them

కొన్ని వారాల నుండి ఒక్క రోజుకే తగ్గిన వీసా జారీ సమయం
గతంలో వీసా పొందేందుకు 26 సబ్ కేటగిరీలుండగా వాటిని 22కి కుదించామని, అట్లాగే గతంలో 104 సబ్ కేటగిరీలుంటే 69కి తగ్గించినట్లు వెల్లడించారు. 2024లో జారీ చేసిన మొత్తం వీసాలలో ఈ వీసాల వాటా (e-Visas) వాటా 65.15 శాతం పేర్కొన్నారు. వీసా విధానాల సులభతరం వల్ల వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుండి ఒక్క రోజుకే తగ్గినట్లు తెలిపారు.

ఈ నగరాల్లో అమల్లో ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం
ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నాటికి దేశంలో 82 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులుండగా, ప్రస్తుతం 114కి పెంచినట్లు వివరించారు. అట్లాగే ఢిల్లి, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్‌లలో ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం (FTI-TTP) అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వారికి ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్
ప్రీ-వెరిఫైడ్ ప్రయాణికులు ఈ విమానాశ్రయాల్లో కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చునని తెలిపారు. త్వరలో ఈ సౌకర్యాన్ని కోజికోడ్, లక్నో, తిరువనంతపురం, అమృత్సర్, తిరుచిరాపల్లి, నోయిడా, నవి ముంబై విమానాశ్రయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేసినట్టు వెల్లడించారు.

వారి కోసం "CAA-2019" మొబైల్ యాప్
OCI పోర్టల్‌ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన 6 నిర్దిష్ట మైనారిటీ సమూహాల పౌరసత్వ దరఖాస్తుదారులకు సాయం చేయడానికి "CAA-2019" మొబైల్ యాప్ అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ సందర్బంగా అధికారుల పనితీరును అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+