17 రోజుల నుంచి కనిపించకుండా పోయిన రైలు
గాంధీనగర్: ఇప్పటివరకు విమానాలు కనిపించకుండా పోయిన వార్తలే విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా రైలు కూడా కనిపించకుండా పోయిందనే వార్తలు వస్తున్నాయి. జోధ్‌పూర్ నుంచి గుజరాత్ బయలుదేరిన ఓ గూడ్స్ రైలు కనిపించకుండా పోయింది. అది కూడా 17 రోజుల నుంచి.
వివరాల్లోకి వెళితే.. ఓ గూడ్స్ రైలు జులై 27న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా రేవుకు వెళ్లేందుకు బయల్దేరింది. ఎగుమతుల వ్యాపారం చేసే రంజన్ కన్సారా అనే వ్యక్తి ఆ రైలును సరుకు రవాణా కోసం బుక్ చేసుకున్నారు. ఆ రైలులో మొత్తం 90 కంటైనర్లు ఉన్నాయి.

కాగా, ఒక్కో కంటైనర్‌లో రూ. 10 లక్షలు విలువ చేసే సామాగ్రి ఉంది. అంటే మొత్తం రూ. 9కోట్ల విలువ చేసే సామాగ్రితో ఆ రైలు బయల్దేరింది. మూడు రోజుల్లోగా గుజరాత్ చేరుకోవాల్సిన ఆ రైలు మధ్యలోనే కనిపించకుండా పోయింది.
ఇప్పటికి 17 రోజులైనా రైలు గమ్యస్థానాన్ని చేరుకోలేదు. ఆన్‌లైన్‌లో స్టేటస్ చూస్తే ఆగస్టు 2వ తేదీ నుంచి ఆ రైలు అహ్మదాబాద్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. కానీ, రైలు అక్కడ కన్పించలేదు. దీనిపై రంజన్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. వర్షాల కారణంగా రైలు ఆలస్యమై ఉంటుందేమోనని అధికారులు తెలిపినట్లు సమాచారం.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications