వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ క్రోమ్ వాడేవారికి హ్యాకర్ల ప్రమాదం ఉందన్న అట్లాస్ వీపీఎన్; సేఫ్టీ విషయంలో వార్నింగ్!!

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. అయితే సేఫ్టీ విషయంలో గూగుల్ క్రోమ్ చాలా వెనుకబడి ఉందని తాజాగా అట్లాస్ వీపీఎన్ వెల్లడించింది. మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లతో పోలిస్తే గూగుల్ క్రోమ్ సేఫ్టీ అత్యంత తక్కువ ఉందని అట్లాస్ వీపీఎన్ తెలిపింది.

గూగుల్ క్రోమ్ వినియోగదారులకు సేఫ్టీ సమస్య

గూగుల్ క్రోమ్ వినియోగదారులకు సేఫ్టీ సమస్య

గూగుల్ క్రోమ్ ఉపయోగించే వారి కంప్యూటర్లు, ఇతర డివైజ్లను హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేయడానికి వీలవుతుందని, హ్యాకర్లు గూగుల్ క్రోమ్ వినియోగదారుల కంప్యూటర్లను కంట్రోల్ లోకి తెచ్చుకొని సమాచారాన్ని దొంగిలిస్తారని హెచ్చరించింది. గతంలో కూడా గూగుల్ క్రోమ్ వినియోగదారులు హాకర్ల ద్వారా దోపిడికి గురి అవుతారని ఐటీ మంత్రిత్వశాఖలో భాగమైన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు మళ్లీ అట్లాస్ వీపీఎన్ గూగుల్ క్రోమ్ భద్రతపై వినియోగదారులను అలెర్ట్ చేసింది.

 గూగుల్ క్రోమ్ ద్వారా సిస్టమ్ హ్యాక్ చేసే ఛాన్స్

గూగుల్ క్రోమ్ ద్వారా సిస్టమ్ హ్యాక్ చేసే ఛాన్స్

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి కావలసిన అనేక బలహీనతలు ఉన్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం గతంలోనే వెల్లడించింది. గూగుల్ క్రోమ్ ఉపయోగించే వినియోగదారుల కంప్యూటర్లపై సైబర్ నేరగాళ్ళు దాడి చేయడానికి, హ్యాక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. గూగుల్ క్రోమ్ వినియోగం వినియోగదారుల సిస్టమ్ లోని అన్ని భద్రతా తనిఖీలను దాటడానికి హ్యాకర్లకు అనుమతినిస్తోందని పేర్కొంది. అయితే గూగుల్ క్రోమ్ వినియోగదారులందరూ ఈ ప్రమాదంలో లేరని, కొందరు వినియోగదారులు మాత్రమే ఈ ప్రమాదం లో ఉన్నారని పేర్కొంది.

గూగుల్ క్రోమ్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని సూచన

గూగుల్ క్రోమ్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని సూచన


104.0.5 5112.101 కంటే మునుపటి గూగుల్ క్రోమ్ వెర్షన్ ను అమలు చేస్తున్న వినియోగదారులకు మాత్రమే ఈ ప్రమాదం ఉందని, వెంటనే గూగుల్ క్రోమ్ ను అప్డేట్ చేసుకోవాలని గతంలోనే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేర్కొంది. అయితే ప్రస్తుతం అట్లాస్ వీపీఎన్ 106.0.5249.61/62 బ్రౌజర్ వెర్షన్ కూడా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది. లేదంటే ఆయా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ల వినియోగదారులకు హ్యాకర్ల ప్రమాదం పొంచివుందని వార్నింగ్ ఇస్తుంది.

గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోండిలా

గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోండిలా

ఇక గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ ను అప్డేట్ చేసుకోవడం కోసం చేయవలసిందల్లా సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి వెబ్ స్క్రీన్ కుడివైపున పైన మూలలో ఉన్న మూడు చుక్కల పై క్లిక్ చేస్తే అందులో ఆప్షన్స్ లో సెట్టింగ్స్ వస్తుంది. ఆ తర్వాత సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తే అబౌట్ గూగుల్ క్రోమ్ అని ఆప్షన్స్ లో వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అది మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని దానంతట అదే అప్డేట్ చేస్తుంది.

English summary
Google Chrome users are at risk of hackers, Atlas VPN has given a warning in terms of safety. Atlas VPN suggests to update Google Chrome from the old version to the latest version.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X