అది ఆసుపత్రా? స్మశానమా? మళ్లీ 24 గంటల్లో 16 మంది చిన్నారులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్డీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ ఆసుపత్రిలో 16 మంది చిన్నారులు మృతిచెందారు.

గోరఖ్‌పూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్డీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ ఆసుపత్రిలో 16 మంది చిన్నారులు మృతిచెందారు.

వీరిలో 10 మంది చిన్నారులు నియోనాటల్ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతూ మరణించగా.. మరో ఆరుగురు పీడియాట్రిక్‌ ఐసీయూలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మెదడువాపుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినవారే.

 Gorakhpur: 16 more children die in the last 24 hours

గత ఆగస్టులో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడం వల్ల 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో ఒక్కసారిగా ఈ ఆసుపత్రి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌డీ ఆసుపత్రి యజమానితో పాటు పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ ఆసుపత్రిలో మొత్తం 310 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే తాజా మరణాలు ఆక్సిజన్‌ కొరత వల్ల కాదని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు చికిత్సకు స్పందించకపోవడం, వైద్య సంబంధిత కారణాల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరే నాటికే ఆ చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+