ప్లాన్ ప్రకారమే గౌతమి హత్య: ఫ్యామిలీ కన్నీరుమున్నీరు
బెంగళూరు: కాలేజ్ అటెండర్ చేతిలో హత్యకు గురైన గౌతమి (18) కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకుని బోరున విలపిస్తున్నారు. తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి తమను ఆదుకుంటుందని బావిస్తే ఈ విదంగా పైలోకాలకు వెళ్లిపోయిందని రోదిస్తున్నారు. గౌతమి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవ్వరికి సాధ్యం కావడం లేదు
కర్ణాటక హోం శాఖ మంత్రి కే.జే. జార్జ్, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి. బెంగళూరు ఆగ్నేయ విభాగం డీసీపీ రోహిణి కాడుగోడులోని ప్రగతి కాలేజ్ చేరుకుని వివరాలు సేకరించారు. కాలేజ్ యాజమాన్యంతో జార్జ్ మాట్లాడారు. ఒక విద్యార్థిని అంతం చేసిన అటెండర్ మహేష్ (28) నడవడికపై మీరు ఎందుకు దృష్టి పెట్టలేదని నిలదీశారు.
ఈ సందర్బంగా జార్జ్ మీడియాతో మాట్లాడుతూ - పీయుసీ విద్యార్థిని గౌతమిని హత్య చేసిన మహేష్ ను పట్టుకొవడానికి మూడు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి మాట్లాడుతూ - మహేష్ పక్కా ప్లాన్ తో గౌతమిని హత్య చేశాడని విచారణలో వెలుగు చూసిందని అన్నారు.

హత్య చేసిన పరారైన మహేష్ కొసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. గౌతమిని హత్య చేసిన మహేష్ ఆమె స్నేహితురాలు శిరీషను హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని డీసీపీ రోహిణి అన్నారు.
రాత్రి 10 గంటల సమయంలో మహేష్ హాస్టల్ లో గౌతమితో గొడవ పెట్టుకున్నాడని విచారణలో వెలుగు చూసిందని అన్నారు. ఆ సమయంలో మహేష్ కావాలనే హాస్టల్ గదిలోకి వెళ్లాడని, పక్కా ప్లాన్ తో హత్య చేశాడని విచారణలో వెలుగు చూసిందని రోహిణి చెప్పారు.
శిరీష మీద బుల్లెట్ దూసుకు వెళ్లిందని, ఆమె చెవి, ముక్కుకు గాయాలు కావడంతో పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నదని డీసీపీ రోహిణి అన్నారు. కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగకుండ పోలీసులు జాగ్రతలు తీసుకున్నారు. ముందు జాగ్రత చర్యగా కాలేజ్ కు సెలవు ప్రకటించారు. హాస్టల్ మూసి వేశారు. ప్రగతి కాలేజ్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications