పాకిస్థాన్ మైనార్టీలకు భారత్ పౌరసత్వం

న్యూఢిల్లీ: వేధింపపులు తట్టుకోలేక భారత్ లో తలదాచుకున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన మైనార్టీలను తాము ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు అన్నారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు.

మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్ కు శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. వారు ఇప్పటికే భారత్ లో తలదాచుకున్నారని గుర్తు చేశారు. ఈ శరణార్థులకు లాంగ్ టర్మ్ వీసా లేదా, పౌరసత్వం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.

Government committed to long-term visa to Pakistan minorities

స్వదేశంలో అక్కడి ప్రభుత్వం నిర్బంధాన్ని తట్టుకోలేక భారత్ వచ్చి తలదాచుకుంటున్న వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ కు చెందిన వారు ఉన్నారని అన్నారు. తరువాత స్థానంలో పాకిస్థాన్, ఆఫ్ఘన్ దేశాలకు చెందిన వారు ఉన్నారని అన్నారు.

మతద్వేషాన్ని ఎదుర్కోలేక భారత్ వచ్చిన మైనార్టీలను ఆదుకోవడం కనీస ధర్మంగా భావిస్తున్నామని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+