EPS News: పెన్షనర్లకు గుడ్ న్యూస్..నెలవారీ కనీస పెన్షన్ పెంపు..?
EPS News:ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (EPS)కింద పెన్షనర్లకు కనీస నెలవారీ వేతనం రూ.1000గా ఉంది.
ఇప్పుడు దాన్ని రూ.7500కు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 1995లో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.1000గా ఉండటంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తోంది. ఇది అమలులోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి.

పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పెంపుపై ఆలోచించాలని కోరారు.డీఏ పెంపు, తమకు తమ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపు పై కూడా పునరాలోచించాలని కోరారు. ఇదిలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. EPS-95 పెన్షన్ దారులు పెన్షన్‌ను రూ.7500కు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుండగా ట్రేడ్ యూనియన్లు మాత్రం వారికి నెలకు రూ.5000 ఇవ్వాలని కోరుతోంది. ట్రేడ్ యూనియన్ల వాదన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో రూ.5000 బతకడానికి సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస పింఛను రూ.1,000గా నిర్ణయించాలని ప్రభుత్వం 2014లో ప్రకటించినప్పటికీ, 36.60 లక్షల మంది పింఛనుదారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుత వ్యవస్థలోని వ్యత్యాసాలను ఎత్తిచూపింది.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి 12శాతం పదవీవిరమణ కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. సంస్థ కంట్రిబ్యూషన్ నుంచి 8.33శాతం ఈపీఎస్‌కు మళ్లించడం జరుగుతుంది. మిగతా 3.67శాతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)కి కేటాయిస్తారు.
పదవీ విరమణ తర్వాత తగినన్ని ప్రయోజనాలను అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని పెన్షనర్లు వాదిస్తున్నారు. పింఛనుదారుల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్ అయిన వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రతిపాదిత పెంపు రూ.7,500 అమలైతే, దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది. నిర్మలమ్మ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 202లో ఈ సంస్కరణకు చోటు ఉంటుందని పెన్షనర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications