వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ మాల్యా బకాయి రద్దుపై అరుణ్ జైట్లీ స్పందన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విజయ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్ల బకాయిల రద్దు పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు స్పందించారు. ప్రభుత్వం మాల్యా కేసును పరిశీలిస్తోందని, బకాయిలను రద్దు చేయలేదని ఆయన చెప్పారు.

సామాన్యులకు చుక్కలు: మాల్యా సహా 63 మంది రూ.7వేల బకాయిలు రద్దు, ఏపీ-టీ కంపెనీలూ..సామాన్యులకు చుక్కలు: మాల్యా సహా 63 మంది రూ.7వేల బకాయిలు రద్దు, ఏపీ-టీ కంపెనీలూ..

కాగా, రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ తన ఫేస్‌బుక్‌ కవర్ పేజీపై ఓ నినాదాన్ని ఉంచారు.

Government is pursuing the Vijay Maliyal case, no write off, Arun Jaitley

'భారతదేశం నల్లధనంతో ఎక్కువ కాలం ఉండద'ని కవర్ పేజీలో పేర్కొన్నారు. నల్లధనాన్ని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో భరించదని, దేశాభివృద్ధికి నీతి, చిత్తశుద్ధి, నైతిక ప్రవర్తన ఆవశ్యమని జైట్లీ పేర్కొన్నారు.

వ్యాపారులు, రైతులతో భేటీ కానున్న కేజ్రీవాల్‌

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం నాడు వ్యాపారులు, రైతులు, కార్మికులతో సమావేశమై పెద్ద నోట్ల రద్దు విషయంపై చర్చించనున్నారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఆజాద్‌పూర్‌మండీ వద్ద రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి, పెద్ద నోట్ల రద్దు వలన సామాన్యప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించనున్నట్లు కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

English summary
Government is pursuing the Vijay Maliyal case, no write off, Arun Jaitley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X