వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్ కమిటీల కొనసాగింపునకు కేంద్రం నిర్ణయం...8 కేబినెట్ కమిటీల్లో సభ్యులు వీరే..!

|
Google Oneindia TeluguNews

గత ప్రభుత్వంలో పలు కీలక అంశాలపై వేసిన కేబినెట్ కమిటీలను ఈ కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో అతి ముఖ్యమైన అపాయింట్‌మెంట్ కమిటీ, ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ, భద్రత వంటివి ఉన్నాయి. ఇక ఈ ఎనిమిది కేబినెట్ కమిటీల్లో అకామొడేషన్, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, భద్రత, పెట్టుబడులు మరియు వృద్ధి, ఉపాధి మరియు నైపుణ్యతలు ఉన్నాయి.

ఇక కొత్త ప్రభుత్వంలో ఏర్పాటు అయిన కేబినెట్‌ కమిటీల్లో ప్రధాని మోడీ ఆరు కమిటీల్లో ఉన్నారు. ఒక్క అకామొడేషన్, మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను మినహాయిస్తే మిగతా ఆరింటిలో మోడీ ఉన్నారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎనిమిది కేబినెట్ కమిటీల్లో ఉన్నారు. ఇక కమిటీలు అందులో సభ్యులు ఇలా ఉన్నారు.

Government re-constitutes Cabinet committees, check the full list

1.అప్పాయింట్‌మెంట్ కమిటీ:

నరేంద్ర మోడీ ,అమిత్ షా

2. అకామొడేషన్స్ కమిటీలో అమిత్ షా కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర సహాయ మంత్రులు జితేంద్ర సింగ్, హర్దీప్ సింగ్ పూరీలు ఉంటారని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

3. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యులు:

మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, డీవీ సదానంద గౌడ, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర బాదల్, డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, ధర్మేంద్ర ప్రధాన్

4. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ:

అమిత్ షా, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, ఆర్ఎస్ ప్రసాద్, రామ్‌విలాస్ పాశ్వాన్, తవార్ చంద్ గెహ్లాట్, ప్రకాశ్ జవడేకర్, ప్రహ్లాద్ జోషి
ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, వి. మురళీధరన్‌లు ఉంటారు.

5. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ:
ప్రధాని మోడీ, అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, తోమర్, ఆర్ఎస్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్, గోయల్, హర్ష వర్ధన్, అరవింద్ గన్‌పత్, ప్రహ్లాద్ జోషి

6. భద్రతపై కేబినెట్ కమిటీ:

ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్

7. పెట్టుబడులు మరియు వృద్ధి:

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్

8. ఉపాధి మరియు నైపుణ్యత కేబినెట్ కమిటీ:

నరేంద్ర మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, తోమర్, పీయూష్ గోయల్, రమేష్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్, మహేంద్ర నాథ్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హర్దీప్ సింగ్ పూరీ. ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా నితిన్ గడ్కరీ, హర్‌సిమ్రత్‌ కౌర్ బాదల్, స్మృతీ ఇరానీ, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉంటారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సార్వత్రిక ఎన్నికల్లో 543 స్థానాలకు గాను 353 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

English summary
The Government of India has reconstitute the Cabinet Committees under the Transaction of Business Rules.These include - Appointments Committee of the Cabinet, Cabinet Committee on Accommodation, Cabinet Committee on Economic Affairs, Cabinet Committee on Parliamentary Affairs, Cabinet Committee on Political Affairs, Cabinet Committee on Security, Cabinet Committee on Investment and Growth and Cabinet Committee on Employment and Skill Development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X