ఈడీ నోటీసులు జారీ వెనుక - ఎంపీ చిన్ని క్లారిటీ..!!
ఈడీ నోటీసుల జారీ వ్యవహారం పైన చర్చ జరుగుతోంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి లిక్కర్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయనే వార్తల పైన ఎంపీ స్పష్టత ఇచ్చారు. నోటీసుల వెనుక అసలు కారణాలను వెల్లడించారు. ఈ నోటీసులు లిక్కర్ కేసుకు సంబంధించి కాదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారంకు సంబంధించినవిగా వివరించారు. గతంలో రాజ్ కేసిరెడ్డితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి.. ఆ తరువాత ఆపేసినట్లు చెప్పుకొచ్చారు.
లిక్కర్ స్కాం కేసులో తన సతీమణి జానకి లక్ష్మీకి ఈ డి నోటీసులంటూ వస్తున్న వార్తలను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఖండంచారు. తన భార్యకు నోటీసులు ఇవ్వలేదు, ఫ్రైడ్ కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చాయని చెప్పుకొచ్చారు. SPV లో ప్రతినిధులుగా రెండు సంస్థలు ఉన్నాయని చిన్ని వివరించారు. అందులో ఒక సంస్థలో తన సతీమణి డైరెక్టర్ గా ఉన్నారని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో భాగంగా ఆ సంస్థ నుంచి 35 లక్షలు మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగిందని వివరించిన చిన్ని...తన సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కంపెనీకి వచ్చిన నోటీసులపై ఈనెల 27న సమాధానం ఇస్తారని స్పష్టం చేసారు. ఇదే సమయం లో మరిన్ని కీలక అంశాలను వెల్లడించారు.

అసలు జరిగింది ఇదీ..!
తాను రాజ్ కేసిరెడ్డి ఓ సైట్ డెవలప్ మెంట్ చేయాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. అనివార్య కారణాల వలన కొద్ది రోజులకే రాజ్ కేసిరెడ్డి తో వ్యాపార లావాదేవీలు ఆపేసినట్లు వెల్లడించారు. 2020-2021 మామధ్య సైట్ డెవలప్మెంట్ లో 35 లక్షల రూపాయలు లావాదేవీలు జరిగాయని.. రాజ్ కేసిరెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేసారు. రాజ్ కేసిరెడ్డి తో వ్యాపార సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికీ నోటీసులు అందాయని చిన్ని వెల్లడించారు. దానిలో భాగంగా తమ కంపెనీకి నోటీసులు అందాయన్నారు. నోటీసులకు సమాధానం ఇస్తామని.. తాను ఏ తప్పు చేయనని చిన్ని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications