కాంగ్రెస్ - విజయ్ పొత్తు.. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ, కొత్త లెక్కలు..!!
తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమిళనాడులో మిత్రపక్షాలతో కలిసి అసెంబ్లీలో బలం నిరూపించుకున్న విజయ్.. ఇప్పుడు పార్టీ విస్తరణ పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా తాజాగా విజయ్ పొలిటికల్ స్ట్రాటజిస్టులు విజయ్ అభిమానులతో కలిసి కేరళ లో సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు దక్షిణాదిన వరుసగా మిగిలిన రాష్ట్రాల పైన కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ తో కలిసి ముందుగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో ఒక నిర్ణయానికి వచ్చారు.
తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని జాతీయ పార్టీగా విస్తరించే దిశగా దళపతి అడుగులు వేస్తున్నారు. తన పరపతి తగ్గకముందే వేగంగా వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నారు. తమిళనాడు తర్వాత కర్ణాటకపై కన్నేసిన దళపతి త్వరలో జరిగే బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులను బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ తో కలిసి పొత్తుతో వచ్చే నెలలో జరిగే బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తమిళులు ఎక్కువగా నివసించే 50 డివిజన్లలో ముందుగా పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నేతలతోనూ చర్చలు జరిగాయి. బెంగళూరు సిటీలో దాదాపు 20 నుంచి 22 లక్షల మంది వరకు తమిళులు నివసిస్తున్నారని చెబుతున్నారు. చాలా చోట్ల తమిళుల ఓట్లే గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

బెంగళూరు కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ
తమిళనాడుకు చెందిన వారితో పాటుగా బెంగళూరులోనూ విజయ్ కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో, ముందుగా బెంగళూరు నగరంలో తన బలం చెక్ చేసుకునే క్రమంలో విజయ్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పైన కసరత్తు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా విజయ్ అభిమాన సంఘాలు ఇక్కడ నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండటం కూడా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉండటం.. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుందనే అంచనా వేళ విజయ్ వ్యూహాత్మకంగా బెంగళూరు ఎన్నికలను ఎంచుకున్నారు. వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో రాహుల్ తో విజయ్ ఈ ఎన్నికలు.. భవిష్యత్ పొత్తుల పైనా చర్చించునున్నారు. దీంతో.. విజయ్ బెంగళూరు బరిలో దిగితే.. మద్దతు.. ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications