వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాది గవర్నర్‌పై లైంగికవేధింపుల ఫిర్యాదులు: ఎవరాయన?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణాదిలోని ఓ రాష్ట్ర గవర్నర్‌పై కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఫిర్యాదు అందింది. రాజ్‌ భవన్‌ లో పనిచేసే మహిళ ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పుడుతన్నారనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.

రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగినులు తనతో సన్నిహితంగా ఉండాలని కోరుకొంటున్నారని బాధితులు కొందరు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.

Governor of a southern state accused of ‘sexual misconduct’

అయితే ఏ రాష్ట్ర గవర్నర్ ఈ రకంగా వ్యవహరిస్తున్నాడనే విషయమై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు మాత్రం బయటకు చెప్పడం లేదు. ఈ ఆరోపణలు నిర్దారణ అయితే కేంద్రం గవర్నర్‌ను రాజీనామా చేయాలని కోరే అవకాశం ఉంది.

లైంగిక వేధింపుల ఆరోపణలతోనే మేఘాలయ గవర్నర్‌గా పనిచేసిన వి. షణ్ముగనాథన్ తన పదవికి గత ఏడాది జనవరి మాసంలో రాజీనామా చేశారు.అయితే దక్షిణాదిన మరో గవర్నర్‌పై ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చే పనిలో దర్యాప్తు సంస్థలున్నాయి.

English summary
A complaint about alleged misconduct on the part of a governor of a southern state has been received by the home ministry and is being investigated for its veracity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X