'ఏ టైమ్‌లో అయినా గవర్నర్ నుంచి కబురు రావచ్చు': శశికళ శిబిరంలో ఆశలు
గవర్నర్ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చునని, అందుకే తామంతా ఒకేచోట ఉన్నామని రత్నస్వామి తెలిపారు.
చెన్నై: కాసేపట్లో గవర్నర్ నుంచి ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. శశికళ వర్గీయులు ఆయన తమకే కబురు పెట్టబోతున్నారన్న ధీమాతో ఉన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శశికళ మద్దతుదారు రత్నస్వామి ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
గవర్నర్ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చునని, అందుకే తామంతా ఒకేచోట ఉన్నామని రత్నస్వామి తెలిపారు. ఎమ్మెల్యేలను బంధించారంటూ పన్నీర్ సెల్వం వర్గం వారు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాము ఎమ్మెల్యేలను బంధించలేదని అన్నారు.

కాగా, శశికళ తరలించిన 130మంది ఎమ్మెల్యేలు బృందానికి 30మంది చొప్పున నాలుగు బృందాలుగా నాలుగు వేర్వేరు రిసార్టుల్లో మకాం వేశారని అన్నారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్ వద్ద ఎమ్మెల్యేలకు కాపలాగా ఉన్న బౌన్సర్లు మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, జర్నలిస్టులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో మీడియా ప్రతినిధులకు బౌన్సర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications