చెన్నైకి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్: స్పీకర్, పార్టీ చీప్ విప్ భేటీ, రెబల్ ఎమ్మెల్యేలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ ఈనెల 18వ తేదీ సోమవారం చెన్నై వస్తున్నారు. గవర్నర్ సోమవారం కచ్చితంగా చెన్నై వస్తారని గురువారం తమిళనాడు అడ్వకేట్ జనరల్ మద్రాసు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.

శశికళ రాయల్ లైఫ్: క్లారిటీ ఇచ్చిన హోం మంత్రి రామలింగా రెడ్డి, తమిళ్ లో చిన్నమ్మతో ?

అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ చీప్ విప్ రాజేంద్రన్ గురువారం సచివాలయంలో స్పీకర్ ధనపాల్ ను కలిసిమరోసారి మనవి చేశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

TN in charge Governor CH Vidhyasagar Rao will reach Chennai on Monday.

ఈ సందర్బంలో రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని అన్నాడీఎంకే పార్టీ చీప్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు మరో సారి మనవి చేశారు. కర్ణాటకలోని కొడుగు సమీపంలోని రిసార్ట్ లో జల్సా చేస్తున్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు మాత్రం మేము స్పీకర్ ధనపాల్ నోటీసులకు సమాధానం ఇవ్వమని మరోసారి తేల్చి చెప్పారు. ఇప్పుడు స్పీకర్ ధనపాల్ రెబల్ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TN in charge Governor CH Vidhyasagar Rao will reach Chennai on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి