అసెంబ్లీలో జయలలితను పొగిడిన రోశయ్య, కరుణానిధి ఆశ్చర్యం
చెన్నై: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత పైన ప్రశంసలు కురిపించారు. ఇది ఆయనను ఇబ్బందుల్లో పెట్టింది. జయను పొగడటం పైన ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
గవర్నర్ హోదాలో సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. అనేక అంతర్రాష్ట్ర జలవివాదాల్లో జయ వైఖరిని రోశయ్య ప్రశంసించారు. ముళ్లపెరియార్ డ్యాంకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు తమిళనాడుకు అనుకూలంగా వచ్చిందంటే అందుకు జయలలిత పోరాటమే అన్నారు.

ముళ్లపెరియార్ డ్యాంక్ నిర్మాణపరంగా, ప్రకంపనలపరంగా సురక్షితమని, 142 ఫీట్లకు వాటర్ లెవల్ మంచిదేనని తీర్పు వచ్చిందని, అది జయ వల్లే అన్నారు.
జయలలితను ప్రశంసించడంతో డీఎంకే అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, పీఎంకే చీఫ్ రామదాస్ తదితరులు గవర్నర్ పైన మండిపడ్డారు. వంద కోట్ల జరిమానా విధించబడిన, నాలుగేళ్ల జైలుశిక్షపడిన వ్యక్తిని అసెంబ్లీలో పొగడటం చాలా ఆశ్చర్యంగా ఉందని కరుణానిధి అన్నారు.












Click it and Unblock the Notifications