చెల్లెలు మమతా బెనర్జీ అంటూనే, హితబోధ చేసిన గవర్నర్ : సీఎంగా దీదీ ప్రమాణం తర్వాత షాకింగ్ సంఘటన!!
మూడవ సారి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు రాజ్ భవన్ లో గవర్నర్ జగదీప్ ధన్ కర్ మమతాబెనర్జీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది ముఖ్యులతో జరిగిన ఈ కార్యక్రమంలో, మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారం తర్వాత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
మమతా బెనర్జీకి హితబోధ చేసిన గవర్నర్ జగదీప్ ధన్ కర్
గవర్నర్ జగదీప్ ధన కర్ మమతా బెనర్జీకి హితబోధ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసపై ఆమెకు జ్ఞాన బోధ చేసే ప్రయత్నం చేశారు. గవర్నర్ జగదీప్ ధన్ కర్ పశ్చిమబెంగాల్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర ప్రాతిపదికన ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి తన చెల్లెలు అని, ఈ సందర్భంగా తాను ఎదగాలని కోరుకుంటున్నానని గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరోనా కట్టడి తన మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న మమతా బెనర్జీ
మమతాబెనర్జీ పక్షపాత ప్రయోజనాల కంటే పైకి ఎదగాలి. మీరు కొత్త పాలన సరళిని కొనసాగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ వ్యాఖ్యానిస్తున్న సమయంలో మమతా బెనర్జీ ఆయన పక్కనే ఉన్నారు.అంతకు ముందు మమతాబెనర్జీ తన మొదటి ప్రాధాన్యత కరోనా మహమ్మారిని నియంత్రించడం అని , ప్రమాణ స్వీకార అనంతరం తాను సచివాలయానికి వెళ్లి కరోనా పరిస్థితిపై సమీక్షిస్తానని, కట్టడి చర్యలపై మాట్లాడతానని పేర్కొన్నారు. రెండవది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్త అధికారులను నియమించడం అని పేర్కొన్నారు.
Recommended Video

బెంగాల్ లో మొదటి ప్రాధాన్యతా అంశం శాంతిభద్రతల పరిరక్షణ అని పేర్కొన్న గవర్నర్
ఇదే సమయంలో మమతా బెనర్జీ ఇప్పటివరకు శాంతిభద్రతలకు ఈసీ బాధ్యత వహించిన కారణంగా బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసకు ఈసీదే బాధ్యత అని స్పష్టం చేశారు. సమయంలో ఇక ముందు శాంతిభద్రతలు ఎవరి చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించబోనని మమతా బెనర్జీ చెప్పారు. అయితే గవర్నర్ మాత్రం మమతా బెనర్జీ మొదటి ప్రాధాన్యత శాంతి భద్రతల పరిరక్షణ మీద ఉండాలని, బెంగాల్లో లాండ్ ఆర్డర్ ను పరిరక్షించాలని గవర్నర్ సీఎం మమతా బెనర్జీకి సున్నితంగా హితబోధ చేశారు. ఈ సంఘటన బెంగాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది.












Click it and Unblock the Notifications