గవర్నర్ శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి: సుబ్రహ్మణ్యస్వామి
గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు వీకే శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.
చెన్నై: అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు అన్ని వర్గాల నుంచి మద్దతు కరువుతున్న నేపథ్యంలో.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆమెకు అండగా నిలబడుతుండటం గమనార్హం. తాజాగా ఆయన పన్నీర్‌కు వ్యతిరేకంగా, శశికళకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ఇన్‌చార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు వీకే శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. అదే సమయంలో పన్నీర్ సెల్వం తీరును ఆయన ఎద్దేవా చేశారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరడం టూత్ పేస్టును తిరిగి ట్యూబ్ లో పెట్టడం లాంటిదని ఎద్దేవా చేశారు.

పన్నీర్ సెల్వం తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను ఇంతవరకు ఇవ్వలేదన్న విషయాన్ని సుబ్రహ్మణ్యస్వామి గుర్తుచేశారు. కేవలం రాజీనామా ఉపసంహరణ విషయమే పన్నీర్ ప్రస్తావిస్తున్నారని, కానీ అది ఇప్పటికే ఆమోదింపబడిందని, తిరిగి దాన్ని ఎలా ఉపసంహరించుకుంటారు? అని ప్రశ్నించారు.
రాజ్యాంగ పరిధిలో గవర్నర్ తన విధులకు లోబడి శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం.. ఆ తర్వాత అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వడమే ఆయన ముందున్న ఆప్షన్ అని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.












Click it and Unblock the Notifications