జూనియర్ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్యూలు రద్దు
న్యూఢిల్లీ: జనవరి 1 నుంచి దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్ధల్లోని జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్యూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే నైపుణ్య, శరీరదారుఢ్య పరీక్షలు కొనసాగించవచ్చని పేర్కొంది.
ఇందుకు సంబంధించి డీఓపీటీ అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు సర్కులర్ జారీ చేసింది. ఇంటర్యూల రద్దు, గ్రూస్ సీలోని అన్ని పోస్టులు, గ్రూప్ బిలోని నాన్ గెజిటెడ్, వాటికి సమానమైన అన్ని పోస్టులకు వర్తిస్తుందని వివరించింది. ఈ నెల 31 కల్లా ఇంటర్యూల రద్దు ప్రక్రియను పూర్చి చేయాలని సిబ్బందికి సూచించింది.
ఒకవేళ కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించాలంటే భావిస్తే పూర్తి వివరాలను సంబంధిత మంత్రి ఆమోదంతో జనవరి 7 లోపల తమకు పంపాలని డీఓపీటీ ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. ఇది ఇలా ఉంటే దేశవ్యాప్తంగా ఏకీకృత కనీసం వేతనం నిర్ణయించేందుకు వీలు కల్పించేలా లేబర్ కోడ్ రూపకల్పనకు కేంద్రం శ్రీకారం చుట్టింది.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ బుధవారం సమావేశమై చిన్నపరిశ్రమల బిల్లుకు తుది మెరుగులు దిద్దనున్నారు. 40 మందికంటే తక్కువ మంది కార్మికులు ఉన్న పరిశ్రమలకు ఈ బిల్లు కింద 14 కార్మిక చట్టాల నుంచి మినహాయింపు ఇస్తారు.
బిల్లుకు రూపకల్పన చేశాక ఆమోదం కోసం మంత్రివర్గానికి పంపుతారు. వేతానాలచట్టం, చెల్లింపులు వేతనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం తదితర చట్టాల్లోని నిబంధనలను సరళీకరించి వేతనాల కోడ్ పరిధిలోకి తీసుకురావాలని పార్లమెంట్ సమావేశాల్లో కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
దీంతో పాటు ఉద్యోగినులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడానికి ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లు ముసాయిదాకు కార్మిక శాఖ తుదిమెరుగులు దిద్దుతోంది.












Click it and Unblock the Notifications