328 కాంబినేషన్ మెడిసిన్స్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం...అవి ఏమిటో తెలుసా..?
ఢిల్లీ: ఒళ్లు నొప్పులా అయితే వెంటనే ఫలానా మాత్ర వేసుకో అంటాం.. జ్వరమా అయితే పారాసిటామాల్ మాత్ర మింగమని చెబుతాం. ఇలా కొన్ని ఔషధాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 328 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల అమ్మడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనితో పాటు మరో ఆరు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌లు ఉత్పత్తి కూడా చేయరాదని... కొన్ని ప్రత్యేక నిబంధనల కింద మాత్రమే తయారు చేయొచ్చంటూ ప్రభుత్వం తెలిపింది.
యాంటీబయోటిక్స్‌తో డేంజర్
ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ అంటే రెండు మాత్రలు ఒకేసారి ఒకే డోస్ కింద వేసుకోవడం. పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్, నోరు మరియు గొంతు చికిత్స కోసం యాంటీసెప్టిక్స్, యాంటీడయాబెటిక్స్ లాంటి కొన్ని ఔషధాలు షరతులతో వినియోగించొచ్చంటూ పేర్కొంది. అది కూడా ఇద్దరి వ్యక్తులకు పేషెంట్ వాడుతున్న ఔషధాలు తెలిసి ఉండాలని వెల్లడించింది. ఈ ఆరు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మాత్రలకు క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు. వీటిని నియంత్రించడం కానీ లేదా కొన్ని మార్పులు తీసుకురావడం కానీ జరుగుతుంది.

డిసెంబర్ 2017లో సుప్రీం కోర్టు పలు ఔషధాల వినియోగంపై పునఃపరిశీలించాలని డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డును కోరింది. దీంతో నిపుణలు బృందం 349 ఔషధాల వినియోగంపై ఒక రిపోర్టును డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుకు సమర్పించింది. ఈ 349 ఔషధాల వినియోగంతో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వీటిని నిషేధించడమే మంచిదని పేర్కొంది. డోస్ శాతం కూడా ఎక్కువగా ఉండటంతో విషపూరితంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే క్రమంలో రిపోర్టు ఆధారంగా ఔషాధాల ఉత్పత్తిని నిలిపివేయాలా, లేదా తక్షణమే నిషేధించాలా, లేదా పలుమార్పులతో తిరిగి అమ్మకానికి ఉంచుతారా అనేదానిపై ఆరు నెలల్లో స్పష్టత ఇవ్వాలని డ్రగ్ బోర్డుకు సూచించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!