హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు కంపెనీల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైద్య పరీక్షల కోసం చైనీస్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యాంటీబాడీ టెస్ట్ కిట్స్‌లో లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోపాలు బయటపడ్డ రెండు కంపెనీల ఆర్డర్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్డర్ రద్దు కారణంగా భారత్‌కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని స్పష్టం చేసింది. ఆ రెండు కంపెనీల ఆర్డర్స్‌కు భారత్ డబ్బు చెల్లించలేదని.. కాబట్టి వాటిని తిరిగి పంపిస్తామని వెల్లడించింది.ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు కేంద్రం దాదాపుగా రెట్టింపు ధరను చెల్లిస్తోందని ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన మరుసటిరోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కిట్ల కొనుగోలు ధరపై వివాదం..

కిట్ల కొనుగోలు ధరపై వివాదం..


కేంద్ర ప్రభుత్వం రియల్ మెటబాలిక్స్ అనే భారతీయ డిస్ట్రిబ్యూటర్ ద్వారా చైనీస్ కంపెనీల నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ని కొనుగోలు చేసింది. కానీ ఈ డిస్ట్రిబ్యూటర్‌కి, మాట్రిక్స్ అనే ఇంపోర్టర్ కంపెనీకి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ఢిల్లీ హైకోర్టుకు చేరింది. మ్యాట్రిక్స్ సంస్థ రూ.245 చొప్పున ఒక్కో కిట్‌ను చైనా కంపెనీల నుంచి కొనుగోలు చేయగా.. రియల్ మెటబాలిక్స్,ఆర్క్ ఫార్మాసూటికల్స్‌ ఇవే కిట్లను ఒక్కోదాన్ని రూ.600 చొప్పున కేంద్రానికి విక్రయించారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఒక్కో కిట్‌పై రూ.400 తగ్గించాలని ఆదేశించింది.

ఒక్క రూపాయి నష్టం లేదన్న కేంద్రం

ఒక్క రూపాయి నష్టం లేదన్న కేంద్రం

'ఈ ఆర్డర్స్‌కు ఐసీఎంఆర్ ఎటువంటి చెల్లింపులు జరపలేదు. 100శాతం అడ్వాన్స్ చెల్లింపుల ప్రక్రియలో వీటిని కొనుగోళ్లు చేయలేదు. కాబట్టి భారత్‌కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదు.' అని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వైద్య పరీక్షల సంఖ్యను పెంచేందుకు కేంద్రం చైనా నుంచి దాదాపు 5లక్షలకు పైగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను తెప్పించి పలు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే రాజస్తాన్ సహా పలు రాష్ట్రాల్లో వీటి పనితీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఫలితాల్లో కచ్చితత్వంలో లోపాలు బయటపడటంతో రెండు రోజుల పాటు వీటిని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది.

Recommended Video

Bill Gates Defends China, Blames American Government
లోపాలు బయటపడటంతో

లోపాలు బయటపడటంతో


లోపాలు బయటపడ్డ కిట్లను క్షేత్రస్థాయిలో ఐసీఎంఆర్ కూడా పరిశీలించింది. Guangzhou Wondfo Biotech, Zhuhai Livzon Diagnostics కిట్లు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కిట్ల వల్ల ఉపయోగం లేదని.. కాబట్టి వీటిని ఉపయోగించకూడదని నిర్ణయించింది. దీంతో కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే తెప్పించిన ఆర్డర్స్‌ను తిరిగి వెనక్కి పంపించేందుకు సిద్దమైంది.

English summary
The government on Monday said that it does not stand to lose a single rupee to Chinese firms who provided India with rapid Covid-19 test kits, which many states declared faulty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X