షాకింగ్: 11 లక్షల పాన్‌కార్డులు రద్దు.. మరి మీది? ఇలా చెక్ చేసుకోండి!

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబయి: నకిలీ పాన్‌కార్డులపై ఆదాయపన్ను శాఖ ఉక్కుపాదం మోపింది. ఇటీవల 11.44 లక్షల పాన్‌కార్డులను రద్దు చేసినట్లు సమాచారం. ఒకే వ్యక్తి పలు పాన్‌ నంబర్లు కల్గివుండటం, నకిలీ పాన్‌కార్డులను నియంత్రించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.

త్వరపడండి... ఆగ‌స్టు 31లోగా ఆధార్‌తో లింక్ చేయ‌క‌పోతే పాన్ కార్డ్ ర‌ద్దు!

ఆధార్‌కార్డును పాన్‌ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు ఆగస్టు 31 ఆఖరి గడువుగా నిర్ణయించింది. తాజాగా కేంద్రం చేపట్టిన ఈ చర్యతో మీ పాన్‌కార్డు భద్రంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే..

Govt deactivates 11.44 lakh PAN cards: Is yours still active? Here’s how to check

మొదట ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో ఉన్న 'నో యువర్‌ పాన్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీ ఇంటిపేరు, మొదటి పేరు, పాన్‌ స్టేటస్‌, జెండర్‌, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబర్‌తో రిజస్టర్‌ కావాలి.

పాన్ కార్డు లేకుంటే... నగదు విత్ డ్రా కుదరదు: కేంద్రం తాజా ఝలక్

ఈ క్రమంలో మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కి వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ పాన్‌ కార్డు వాలిడ్‌ అయితే.. యాక్టివ్‌ అని చూపిస్తుంది. ఒకే విధమైన వివరాలతో పలు పాన్‌ నంబర్లు కలిగి ఉంటే పేజీలో అలర్ట్‌ వస్తుంది. ఒకవేళ ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్‌ 2017 నాటికి పాన్‌ కార్డు రద్దు అవుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After identifying a huge number of fake PAN cards, the government of India deactivated around 11.44 lakh PAN cards by July 27 this year. As per government rules, a person can not be registered with more than one PAN number. The government also detected fake PAN cards which were allotted to non-existing individuals or to people who have submitted falsified information about themselves. To check whether your PAN No is still valid, you need to visit Income Tax e-filing website. Here is a quick guide on how you can check the validity of our PAN card Visit http://www.incometaxindiaefiling.gov.in and click on “Know Your PAN” option available on the home page of the website in the left hand column called “Services”.
Please Wait while comments are loading...