వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) నిబంధనలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సింగిల్ బ్రాండ్ రీటెయిల్, డిజిటల్ మీడియా, మానుఫాక్చరింగ్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలిస్తామని కేంద్రం తెలిపింది. ఇలా చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని కేంద్రం అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున్న విదేశీప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎఫ్‌డీఐ రెగ్యులేషన్స్‌ను సడలించడం ద్వారా ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు.

భారత్‌ను తయారీరంగంలో ఒక హబ్‌గా ఏర్పాటు చేస్తామని చెప్పారు పీయూష్ గోయల్. ఇక కొత్తగా సడలించిన ఎఫ్‌డీఐ నిబంధనలతో ఆయా కంపెనీలు తమ దుకాణాలు ఏర్పాటు చేయకముందే ఆన్‌లైన్ రీటెలింగ్ ద్వారా అమ్మకాలు కొనసాగిస్తాయని తెలిపారు. ఇలా చేయడం వల్ల ఐక్యా లాంటి సంస్థలు పుంజుకుంటాయని చెప్పారు. ఇక సింగిల్ బ్రాండ్ రీటెయిల్‌లకు ఇప్పటి వరకు 30శాతం స్థానికంగా అవసరతలు తీర్చే నిబంధన ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలను కూడా సడలిస్తున్నట్లు తెలిపారు. ఇలా చేయడం వల్ల సంస్థలకు ఎక్కువ సౌలభ్యం కల్పించినట్లు అవుతుందని చెప్పారు.

Govt eases FDI norms for single brand retail, coal mining, digital media

ప్రస్తుత మార్కెట్ల పరిస్థితికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకున్నారని పీయూష్ గోయల్ చెప్పారు. ఆన్‌లైన్ సేల్స్ వల్ల ఉద్యోగాలు వస్తాయని, లాజిస్టిక్స్, డిజిటల్ పేమెంట్స్, కస్టమర్ కేర్, ట్రైనింగ్, వస్తువుల ఉత్పత్తి రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయని మంత్రి వివరించారు.

ఇక బొగ్గు అమ్మకాల్లో 100శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల అంతర్జాతీయ కంపెనీలు కూడా బొగ్గు కొనుగోలు అమ్మకాలపై ఆసక్తి కనబరుస్తాయని చెప్పారు. సోమవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రం ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లును బదిలీ చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకు ఈ నగదు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్బీఐ పేర్కొంది.

English summary
In order to boost a sluggish economy, the Centre on Wednesday notified 100% Foreign Direct Investment (FDI) in contract manufacturing under the automatic route. A 26 per cent FDI was also approved in digital media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X