కోవిడ్ - 19 విరుగుడుకు హైడ్రాక్సిక్లోరోక్విన్‌ డ్రగ్‌ వినియోగంపై కేంద్రం ఏం చెబుతోంది..?

కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇందుకు విరుగుడుగా హైడ్రాక్సి క్లోరోక్విన్ మెడిసిన్‌ను కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం సూచించింది. అయితే మలేరియా చికిత్సకు ఉపయోగించే ఈ మెడిసిన్‌ కరోనావైరస్‌కు విరుగుడు కాదనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడిసిన్ రీసెర్చ్ కూడా హైడ్రాక్సి క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)కు ఆమోదం తెలపింది. ఈ క్రమంలోనే ఈ మాత్రల కోసం అగ్ర రాజ్యం అయిన అమెరికాతో సహా పలు దేశాల నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున సరఫరా కోసం డిమాండ్ వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్ వాడకంపై పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

హైడ్రాక్సి క్లోరోక్విన్‌ వినియోగం విస్తరించాలి

హైడ్రాక్సి క్లోరోక్విన్‌ వినియోగం విస్తరించాలి

హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్‌లను కరోనావైరస్ పై పోరుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇవ్వాలని సూచించింది. కంటెయిన్మెంట్ జోన్లలో పనిచేస్తున్న పోలీసులు, పారిశుధ్ధ కార్మికులు, మిలటరీ, వైద్యసిబ్బందికి అందించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ సూచించింది. మార్చి 23వ తేదీని జారీ చేసిన మార్గదర్శకాల్లో అత్యంత ప్రమాదరకర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే సూచించింది. అయితే ఆ తర్వాత హెచ్‌సీక్యూ డ్రగ్‌తో దాదాపుగా మంచి ఫలితాలు రావడంతో ఇక కరోనా పాజిటివ్‌కు విరుగుడుగా ఈ మెడిసిన్ వాడకం మరింత విస్తరించాలని టాస్క్‌ఫోర్స్ చెబుతోంది.

హెచ్‌సీక్యూతో మంచి ఫలితాలు

హెచ్‌సీక్యూతో మంచి ఫలితాలు


ఇక హెచ్‌సీక్యూ మెడిసిన్‌పై ఇతర దేశాల్లో జరుగుతున్న ప్రయోగాలకన్నా... భారత్‌లో మరింత లోతుగా ప్రయోగాత్మకంగా వినియోగించినట్లు ఐసీఎంఆర్ చెబుతోంది. ఇది కచ్చితంగా కరోనావైరస్ పాజిటివ్‌కు విరుగుడుగా పనిచేస్తుందనే నిర్థారణకు వచ్చినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన వారికి ఈ మెడిసిన్ ఇచ్చామని అయితే మంచి ఫలితాలు రాబట్టినట్లు వివరించింది. ఇక ఢిల్లీలో పలు హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి ఈ మెడిసిన ఇచ్చి టెస్టు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇక పూణేలోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కూడా ఈ డ్రగ్‌పై టెస్టులు చేయగా కోవిడ్-19 తీవ్రతలో తగ్గుదల కనిపించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అదే సమయంలో ఈ డ్రగ్ వినియోగం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది.

Recommended Video

    Lockdown : Big Relief To AP People,No Need Passes To Travel In AP
    వీరికి మాత్రం ఇవ్వరాదంటున్న నిపుణులు

    వీరికి మాత్రం ఇవ్వరాదంటున్న నిపుణులు


    ఇక ప్రభుత్వం వెర్షన్ ఇలా ఉంటే నిపుణులు మాత్రం హెచ్‌సీక్యూ డ్రగ్‌ను గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇవ్వరాదని సూచిస్తున్నారు. అదే సమయంలో 15 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇవ్వరాదని సూచిస్తున్నారు. ఇక చికిత్స విషయానికొస్తే దీన్ని మరోసారి పునఃసమీక్షించాలని బలమైన ఫలితాలతో నిరూపించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే భారత్‌లాంటి దేశంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్ చెబుతోంది. వైద్యులు కూడా డ్రగ్ వినియోగంకు ముందు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+