గత ఐదేళ్లలో ఇదే అత్యల్పం?: పీఎఫ్ పై వడ్డీరేటు ఎంతో తెలుసా!
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్)పై వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును 8.55శాతంగా నిర్ఱయించారు. దీనికి సంబంధించిన ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల నియమావళి రీత్యా ఇప్పుడే దీని ప్రకటించే అవకాశం లేదు. ఎన్నికల సంఘం అనుమతి రాగానే, కేంద్ర కార్మికశాఖ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. దీంతో పీఎఫ్ ఖాతాలు కలిగిన 5కోట్ల మంది చందాదారులకు ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఈవారంలోనే పూర్తి చేయనున్నట్టు సమాచారం.

కాగా, గత ఐదేళ్లలో పీఎఫ్ పై అమలుచేసిన వడ్డీ రేట్లలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. 2015-16లో 8.88శాతంగా ఉన్న వడ్డీరేటు, 2016-17లో 8.65శాతానికి, 2017-18లో 8.55శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నిర్ణయించిన వడ్డీరేటును కూడా మరింత తగ్గించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. చివరాఖరికి ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికే కేంద్ర ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications