కోవిడ్ విధుల్లోకి ఎంబీబీఎస్ విద్యార్ధులు-కోరనున్న కేంద్రం- నీట్ ఆలస్యం
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతోంది. రోజుకు 4 లక్షల కొత్త కేసులతో ఈ శతాబ్ధంలోనే అతిపెద్ద ప్రళయాన్ని భారత్ చవి చూస్తోంది. రోజుకు కరోనాతో 3500 మందికి పైగా చనిపోతున్నారు. భారత్‌లోని అరకొర వైద్య సదుపాయాలు, మానవ వనరుల కొరతే ఇందుకు కారణం. దీంతో కేంద్రం ఈ సంక్షోభాన్ని కొంత మేర నియంత్రించేందుకు వీలుగా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులను కోవిడ్ సేవల్లో వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కరోనా డిమాండ్‌కు తగినట్లుగా వైద్య సిబ్బంది లేకపోవడంతో వీరి సేవల్ని వాడుకునే దిశగా కేంద్రం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు తాజాగా నిపుణులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధుల సేవల్ని కరోనా విలయంలో వాడుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు రేపు అధికారిక ప్రకటన చేయబోతోంది. అదే సమయంలో నీట్ పరీక్షను ఆలస్యం చేయడంతో పాటు కోవిడ్ విధుల్లోకి వచ్చే వైద్య విద్యార్ధులకు ప్రత్యేక ఇన్‌సెంటివ్స్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్లలో సైతం వీరికి ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం ప్రకటించచబోతోంది.
Recommended Video
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications