వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: ఇంటింటికీ తాగునీరు కోసం 3.6 లక్షల కోట్లు, ఐదేళ్లలో సమూలంగా టీబీ నివారణ

|
Google Oneindia TeluguNews

ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం 2020-21 బడ్జెట్‌లో 3.6 లక్షల కోట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. సురక్షితమైన మంచినీరు ఇవ్వడంతో వ్యాధులు ప్రబలకుండా అడ్డుకొనే వీలుంటుందని చెప్పారు. దేశంలో జ్వరాలు, ఇతర వ్యాధులు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, పరిశుభ్రమైన నీరు లేకపోవడమేనని పేర్కొన్నారు.

వాటర్ గ్రిడ్..?

వాటర్ గ్రిడ్..?

ఇంటింటికీ మంచినీరు అందిస్తామనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేపెట్టబోతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ఆదర్శంగా తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఇంటింటికీ మంచినీరు అని తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.40 వేల కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టి 95 శాతం ఆవాసాలకు నీరు అందిస్తున్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని పథకం ప్రవేశఫెట్టినట్టు తెలుస్తోంది.

రైతుబంధు..

రైతుబంధు..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కిసాన్ సన్మాన్ యోజన పేరుతో రైతులకు మూడు పర్యాయాలు రూ.6 వేల అందజేస్తోంది. తెలంగాణలో తొలుత ఎకరానికి రూ.4.. తర్వాత ఎకరానికి రూ.5 వేల చొప్పున అందజేశారు. కానీ కేంద్రం మాత్రం ఎంత భూమి ఉన్న రూ.6 వేలు మూడు విడతలుగా అందించనుంది.

పీపీపీ మోడ్

పీపీపీ మోడ్

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో భాగంగా మెడికల్ కాలుజీలను జిల్లా ఆస్పత్రులను అనుసంధానిస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించే వీలుంటుందని చెప్పారు.

విదేశాల్లో కూడా..

విదేశాల్లో కూడా..

అవసరాన్ని బట్టి వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రి/ లేదంటే మెడికల్ కాలేజీలో రోగులకు వైద్య సేవలు అందిస్తారు. విదేశాల్లో నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉందని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. ఆరోగ్య సంరక్షణకోసం కేటాయింపులు గతేడాది కంటే పెరిగాయి. 64 కోట్ల నుంచి 69 కోట్లకు పెంచుతున్నట్టు పేర్కొన్నారు.

2025లో నో టీబీ

2025లో నో టీబీ


టీబీని సమూలంగా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 2025 వరకు దేశం నుంచి టీబీ తరమికొడతామని చెప్పారు. స్వచ్ఛ భారత్ కోసం 12 వేల 300 కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి కూడా 200 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్నామని గుర్తుచేశారు. అంతకుముందు బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

English summary
Budget 2020 News in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X