వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ తలాక్‌పై లోక్‌సభలో రచ్చ.. శబరిమల అంశాన్ని లేవనెత్తిన అసద్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు 2019ను విపక్షాల అభ్యంతరాల మధ్య సభ ముందుంచారు. ట్రిపుల్ తలాక్‌‌ను నేరంగా పరిగణించాలన్న అంశాన్ని తాము వ్యతిరేకించడంలేదని, అయితే తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు.

నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు..నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు..

రవి శంకర్ ప్రసంగానికి అడ్డుతగలడం, కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు థరూర్‌కు బాసటగా నిలవడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల నినాదాల మధ్య మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేవలం ముస్లిం మతానికి చెందిన వారు మాత్రమే భార్యలను విడిచిపెట్టడంలేదని, అన్ని మతాల మహిళలకు భద్రత కల్పించేలా చట్టం రూపొందించాలని థరూర్ అభిప్రాయపడ్డారు.

Recommended Video

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోలుకోలేనిది
Govt Tables New Triple Talaq Bill in Lok Sabha

శబరిమల అంశాన్ని ప్రస్తావించిన అసదుద్దీన్
ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని 14, 15 అధికరణలకు వ్యతిరేకమని అన్నారు. కేవలం ముస్లిం పురుషులను మాత్రమే శిక్షించేలా చట్టం తీసుకురావడంపై అసద్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామంటున్న సర్కారు శబరిమల అంశంలో హిందూ మహిళల గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ఒవైసీ శబరిమల అంశాన్ని ప్రస్తావించిన వెంటనే సభలో మళ్లీ గందరగోళం నెలకొంది. విపక్షాల అభ్యంతరాల మధ్య స్పీకర్ ఓం బిర్లా బిల్లును చర్చకు స్వీకరించడంపై ఓటింగ్ నిర్వహించారు. అవసరమైన మద్దతు లభించడంతో ట్రిపుల్ తలాక్ బిల్లును చర్చకు స్వీకరించినట్లు ప్రకటించారు.

English summary
A fresh bill to ban the practice of instant triple talaq was introduced in the Lok Sabha today. The Muslim Women Protection of Rights on Marriage Bill, 2019.It will replace an ordinance issued in February by the previous BJP-led NDA government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X