Delimitation: లోక్ సభ సీట్లపై బిగ్ టర్న్..! జనాభా ప్లాన్ వెనక్కి-దక్షిణాదికి హామీ ?
లోక్ సభతో పాటు దేశంలోని చట్టసభల్లో సీట్ల పెంపుకు ఉద్దేశించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation 2026) బిల్లును ఇవాళ కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరకబోతున్నాయి. అయితే ఈ పెంపు జనాభా ప్రాతిపదికన చేపట్టడం వల్ల దక్షిణాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం తీవ్ర అన్యాయం జరగబోతోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడింది.
ఇవాళ పార్లమెంంట్ భేటీలో ప్రతి రాష్ట్రానికి కేటాయించాల్సిన లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఒక 'షెడ్యూల్'ను తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మొత్తం సీట్ల సంఖ్యను పెంచాలని ప్రతిపాదించినప్పటికీ సభ మొత్తం సభ్యులలో రాష్ట్రాల వాటా శాతం మారకుండా ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం సభలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

'షెడ్యూల్' అనేది చట్టానికి ఒక అదనపు విభాగం. ఇది చట్టంలోని ప్రధాన పాఠంలో ఉన్న నిబంధనలను స్పష్టం చేస్తూ, వివరణాత్మక సహాయక సమాచారాన్ని అందిస్తుంది. జనాభా నియంత్రణ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనతో తమను శిక్షించడం ఏంటనే రాష్ట్రాల ప్రశ్నల నేపథ్యంలో దక్షిణాదితో పాటు ఒడిశా వంటి రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కడైనా తేడా వస్తే ఎన్నికలు జరిగే తమిళనాడు సహా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగే ప్రమాదం పొంచి ఉంది.












Click it and Unblock the Notifications