Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్ లో 50 వేల ఆలయాలు, పాఠశాలలను పునరుద్ధరిస్తాం: త్వరలో సర్వే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వల్ల జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని అన్నారు. భారత్ లో విలీనమైన తరువాత జమ్మూ కాశ్మీర్ రూపు రేఖలను మార్చేయాల్సి ఉందని, సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

సోమవారం ఆయన బెంగళూరుకు వచ్చారు. కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలతో భేటీ అయ్యారు. భారతీయ జనతాపార్టీ చేపట్టిన జన సంపర్క్ కార్యక్రమంలో భాగంగా.. కిషన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం కిషన్ రెడ్డి స్థానిక బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Govt to conduct survey of defunct schools, temples in Kashmir: G Kishan Reddy

జమ్మూ కాశ్మీర్ లో 50 వేలకు పైగా ఆలయాలు నాశనం అయ్యాయని అన్నారు. వాటన్నింటినీ జీర్ణోద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికోసం సమగ్ర సర్వేను నిర్వహించబోతున్నామని అన్నారు. అనేక ఆలయాలు, విగ్రహాలు, దేవతా మూర్తులు ధ్వసం అయ్యాయని చెప్పారు. 50 వేలకు పైగా ఆలయాలు దశాబ్దాల తరబడి తెరచుకోలేని అన్నారు. అలాంటి వాటిని గుర్తించి, జీర్ణోద్ధరించడానికి నిధులను కేటాయిస్తామని చెప్పారు. వేలాది పాఠశాలలు, విద్యాసంస్థలు మూత పడ్డాయని, వాటిని కూాడా పునరుద్ధరించడానికి సర్వే నిర్వహిస్తామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+