కారులోకి లాగేసుకుని మహిళపై గ్యాంగ్ రేప్: పిఎఎస్ చెంత పడేసి...
కారులోకి లాగేసుకుని దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను పిఎస్ చెంత పడేసి వెళ్లి పోయారు.
సోహ్నా (హర్యానా): నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం జరిగింది. కదులుతున్న కారులో దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటన హర్యానాలోని సోహ్నాలో జరిగింది. ఆ తర్వాత ఆమెను గ్రేటర్ నోయిడాలో పడేసి పారిపోయారు.
ఈ సంఘటనపై హర్యానా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.. గ్రేటర్ నోయిడాలోని కాస్నా పోలీసు స్టేషన్‌కు సమీపంలో బాధితురాలు అచేతనావస్థలో పడి ఉండడాన్ని గమనించారు.

బాధితురాలు గుర్గామ్‌కు చెందిన మహిళ. సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆమె సోహ్నాలో ఉంది. ఆ సమయంలో స్విఫ్ట్ కారులో వచ్చిన దుండగులు ఆమెను కారులోకి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఆమెపై విరుచుకుపడ్డారు.
బాధితురాలిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. బాధితురాలు ఇచ్చే సమాచారం మేరకు దర్యాప్తును కొనసాగిస్తామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications