దారుణం: ప్లాస్టిక్ డ్రమ్ములో సగం కాలిన శవం!
పంజాబ్‌లోని లుధియానాలో అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగుచూసింది. ఓ ఖాళీ ప్లాటులో వ్యక్తి మృతదేహం మూడు ముక్కలుగా నరికి ఉన్న స్థితిలో లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతుడిని 30 ఏళ్ల దవీందర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితులు అతడిని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని మూడు భాగాలుగా నరికారు. మృతదేహంలోని ఒక భాగం సగం కాలిన స్థితిలో ఉండగా.. మిగిలిన భాగాలను తెల్లటి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి ఖాళీ ప్లాటులో పడేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దవీందర్ రెండు రోజుల క్రితమే ముంబై నుంచి లుధియానాకు తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన కేవలం 15 నిమిషాలకే బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దవీందర్ స్నేహితుడు షేరా ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. షేరా మరో వ్యక్తితో కలిసి డ్రమ్మును మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.

ఆందోళనలో స్థానికులు
హత్య ఎక్కడో జరిగిందని, సాక్ష్యాలను రూపుమాపేందుకే మృతదేహాన్ని ఇక్కడ పడేశారని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మూడు రోజుల క్రితమే మెహర్బాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో గుర్తుతెలియని వ్యక్తి కాలిపోయిన మృతదేహం లభించింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు షేరాను, అతని అనుచరులను విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications