వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వస్త్రాలపై పెరగని భారం: 12 శాతం పెంచేందుకు కౌన్సిల్ నో: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

|
Google Oneindia TeluguNews

దుస్తులపై జీఎస్‌టీ పెంపును వాయిదా వేసింది. వస్త్రాలపై జీఎస్​టీని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనపై కేంద్రం వెనకడుగు వేసింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన​ 46వ జీఎస్​టీ మండలి సమావేశమైంది. ఈ భేటీలో కొన్ని వస్తువులపై పన్ను రేట్ల సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వస్త్రాలపై జీఎస్టీ పెంపు గురించి జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. వస్త్రాలపై వసూల్ చేస్తున్న జీఎస్టీ పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే దీనిపై శుక్రవారం జరిగిన 46వ జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి.

GST Council Decides to Defer Hike on Textiles from 5% to 12%

వస్త్రాలపై జీఎస్టీని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో జీఎస్టీ కౌన్సిల్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం వాయిదాపడింది. దీంతో ప్రస్తుతం వసూల్ చేస్తున్న 5 శాతం జీఎస్టీనే వసూలు చేయనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. ఇందులో వస్త్రాలపై వసూలు చేస్తున్న 5 శాతం జీఎస్టీని 2022 నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి 12 శాతం పెంచాలని భావించింది. దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం పెంచితే పేదలకు వస్త్రాలు భారంగా మారతాయని భావించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నిబంధనల అమలు భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమయ్యింది. ప్రధానంగా గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వస్త్రాలపై జీఎస్టీ పెంపు అంశంపై ప్రధాన అజెండాగా మారినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సమావేశం వాయిదాపడింది.

ఇటీవల చెప్పులు, దుస్తులపై 5 శాతం ఉన్న జీఎస్‌టీని 12శాతానికి పెంచారు. ఈ రేట్లు 2022 జనవరి 1న అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీనిపై చేనేత కార్మికులు, వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రేట్లు పెంచడం వల్ల చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది వారి వాదన. దుస్తులపై పన్ను పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ధరలతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలపై 5 శాతం ఉన్న జీఎస్​టీ 12 శాతానికి పెంచింది. ఇది జవనరి 1న అమల్లోకి రానుంది.

English summary
GST Council Decides to Defer Hike on Textiles from 5% to 12% finance minister Nirmala Sitharaman said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X