"జీఎస్టీతో 5లక్షల ఉద్యోగాలు.. యువతను రెండు రకాలుగా చూడాలనుకుంటున్నాం!"

ఉపాధికి కావాల్సిన ఔత్సాహిక నైపుణ్యాలను అందించడంతో పాటు, స్వయం ఉపాధి కల్పించే అవకాశాలపై తాము ఫోకస్ చేసినట్లు తెలిపారు.

ఇండోర్: కేంద్రం ప్రభుత్వం అమలు చేయబోతున్న జీఎస్టీ(వస్తు సేవల పన్ను) సంస్కరణల ద్వారా దేశంలో 5లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరగబోతుందని కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సహాయశాఖమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్పష్టం చేశారు.

ఇప్పటికే అన్ని రాష్ట్రాలు జీఎస్టీకి ఆమోదం తెలిపే పనిలో నిమగ్నమైనందువల్ల రాబోయే రోజుల్లో కంప్యూటర్ ఆపరేటర్ల కోసం భారీగా కొత్త ఉద్యోగాలు ఏర్పడనున్నాయని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఫైనాన్స్ సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన ఉన్న 5లక్షల మంది కంప్యూటర్ ఆపరేటర్లు దీని ద్వారా లబ్ది పొందుతారని చెప్పారు.

gst to create 5lakh job opportunities says union minister

విద్యానగర్ ప్రాంతంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధికి కావాల్సిన ఔత్సాహిక నైపుణ్యాలను అందించడంతో పాటు, స్వయం ఉపాధి కల్పించే అవకాశాలపై తాము ఫోకస్ చేసినట్లు తెలిపారు. దేశ యువతను తాము రెండు విధాలుగా చూడాలనుకుంటున్నామని చెప్పిన కేంద్రమంత్రి.. అందులో 'ఉద్యోగం కోరేవారు, ఉద్యోగం ఇచ్చేవారు' ఉంటారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+