వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్‌టి ఎఫెక్ట్: భారీగా ధరలను తగ్గించిన శాంసంగ్

దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన ఉత్పత్తులపై ధరలను భారీగా తగ్గించింది. జిఎస్‌టి అమలు తర్వాత తన కీలకమైన ప్రాంతం ముంబైలో ఉత్పత్తులపై రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన ఉత్పత్తులపై ధరలను భారీగా తగ్గించింది. జిఎస్‌టి అమలు తర్వాత తన కీలకమైన ప్రాంతం ముంబైలో ఉత్పత్తులపై రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

టెలివిజన్, మైక్రోఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు వంటి కేటగిరిల్లో ఈ ధరల తగ్గింపు ఉంటుందని శాంసంగ్ తెలిపింది. కొత్త ధరలపై డీలర్లకు సమాచారం అందించినట్టు కూడ పేర్కొంది. అయితే ఈ కొత్త పన్నుల విధానలంలో ఢిల్లీ వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడ ధరలను తగ్గించిందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

 GST: Samsung reduces prices in Mumbai region.

ఈ విషయాన్ని కంపెనీ అధికార ప్రతినిధి కూడ ధృవీకరించడం లేదు. జిఎస్‌టి ఎఫెక్ట్‌తో శాంసంగ్ ప్రధాన ప్రత్యర్థైన ఎల్‌జీ తన ఎల్‌ఈడీ టీవిలపై ధరలను పెంచింది. పానాసోనిక్ కూడ తన టివిలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉత్పత్తులపై ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

శాంసంగ్ డీలర్లకు అందించిన సమాచారం మేరకు కొన్ని ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ధరలను కూడ అందిస్తున్నట్టు ప్రకటించింది. 22 అంగుళాల ఎల్‌ఈడీ టీవి ధరను మాత్రం శాంసంగ్ 3 శాతం తగ్గించింది. దీంతో ఈ టీవి ధర రూ.13,900 నుండి రూ. 13,500కు తగ్గింది.

32 అంగుళాల టీవి ధరపై 8శాతం కోత పెట్టింది. దీని ధర రూ.38,900 నుండి రూ. 35,900 కు దిగింది. మిగతా అన్ని టీవి మోడళ్ళ ధరలు తగ్గాయి. ఏసీ కేటగిరిలో 1 టన్ను స్పిట్ యూనిట్ రూ.31,400 నుండి రూ.30,300 కు తగ్గిపోయింది.

English summary
Samsung, the country's biggest consumer electronics and white goods company, has reduced prices in the key Mumbai region after imposition of GST. The price cut across categories spans televisions, microwave ovens, refrigerators, washing machines and air-conditioners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X