ఇక్కడ జగన్ - అక్కడ పటేల్ ఆల్ టైమ్ రికార్డ్- మోదీ కూడా సాధించ లేని ఘనత అది..!!

అహ్మదాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీకి బిగ్ డే. ప్రస్తుతం అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ నెల 5వ తేదీన గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ రూపాన్ని దాల్చుతాయా? లేదా? అనేది స్పష్టం కానుంది.

ఆ అంచనాలు..

ఆ అంచనాలు..

గుజరాత్‌లో మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 1, 5 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 89, రెండో విడతలో 93 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో కిందటి నెల 12వ తేదీన ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. ఈ రెండు చోట్ల కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూసుకుంటే - గుజరాత్‌లో ఓటర్లు వార్ వన్ సైడ్ చేసినట్టే కనిపిస్తోంది. మరోసారి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా తేలింది.

మేజిక్ ఫిగర్‌ను దాటి..

మేజిక్ ఫిగర్‌ను దాటి..

గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 92. దీన్ని అవలీలగా బీజేపీ అందుకుంటుందనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిమాచల్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మొత్తం 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం పొందాలంటే కావాల్సిన సంఖ్యాబలం 35.

బీజేపీ ప్రభంజనం..

బీజేపీ ప్రభంజనం..

ఇక్కడ బీజేపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో సీట్లను సాధించే దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఏ మాత్రం కూడా ప్రభవాన్ని చూపలేకపోతోన్నాయి. కమలనాథుల ధాటికి ఎదురు నివలేకపోతోన్నాయి. ఇతర పార్టీలు కూడా నామమాత్రంగా మిగిలాయి గుజరాత్‌లో. వరుసగా మరోసారి బీజేపీ ఇక్కడ అధికారాన్ని అందుకోబోతుంది రికార్డు స్థాయి మెజారిటీతో.

150కి పైగా..

150కి పైగా..

ఇదివరకెప్పుడూ లేని విధంగా బీజేపీ 153 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 17 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ-8 సీట్లల్లో ముందంజలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు కూడా బీజేపీకి 150 స్థానాలకు పైగా ఆధిక్యత ఎప్పుడూ దక్కలేదు. ఆ ఘనతను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సాధించినట్టయింది.

వైసీపీ తరహాలో..

వైసీపీ తరహాలో..

ఈ ఎన్నికల్లో ఆయన ఘట్లోడియా నుంచి పోటీలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థిపై పాతికవేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఏ రకంగా సునామీని సృష్టించిందో..అచ్చంగా అలాంటి ఫలితాలే ప్రస్తుతం గుజరాత్‌ నుంచి వెలువడుతున్నాయి. బీజేపీ కూడా గుజరాత్‌లో 150కి పైగా సీట్ల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+