మోడీ మార్క్: గుజరాత్ లో బీజేపీ చివరి జాబితా, 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో చాన్స్ !
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాంధించడానికి మోడీ మార్క్ రాజకీయాలతో బీజేపీ నాయకులు దూసుకుపోతున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాంధించడానికి మోడీ మార్క్ రాజకీయాలతో బీజేపీ నాయకులు దూసుకుపోతున్నారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చివరి జాబితాను సోమవారం బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
34 శాసన సభ నియోజక వర్గాల అభ్యర్థుల పేర్లను సోమవారం బీజేపీ అధిష్టానం ప్రకటించింది. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తో సహ 70 మంది పేర్లు ప్రకటించారు.

గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాలో 36 మంది, మూడో జాబితాలో 28 మంది, నాలుగో జాబితాలో ఒకరు, ఐదో జాబితాలో 13 మంది పేర్లు, ఆరో జాబితాలో 34 మంది పేర్లు ప్రకటించారు. 22 ఏళ్ల పాటు వరుసగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రస్తుతం 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
121 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఈ సారి 35 మంది మళ్లీ పోటీ చెయ్యడానికి అధిష్టానం నిరాకరించింది. 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. గుజరాత్ లోని మొత్తం 182 నియోజక వర్గాల్లో డిసెంబర్ 9 వతేదీ 89 శాసన సభ నియోజక వర్గాల్లో, డిసెంబర్ 14వ తేదీ 93 శాసన సభ నియోజక వర్గాలో ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications