గుజరాత్ పోల్: రెండో లిస్ట్ అనౌన్స్ చేసిన కాంగ్రెస్, గెలుపుగుర్రాలకే టికెట్లు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నిన్న ఫస్ట్ ఫేజ్ ఎన్నిక కోసం బీజేపీ 100 మందితో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండెట్ లిస్ట్ అనౌన్స్ చేసింది. గత శుక్రవారం 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. మరో 46 మంది పేర్లతో కూడిన రెండో జాబితాను గురువారం రిలీజ్ చేసింది. దీంతో ఆ పార్టీ 89 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది.
భుజ్ నుంచి అర్జన్ బాయ్ భుడియా, జునాఘడ్ నుంచి భిఖాభాయ్, సూరత్ ఈస్ట్ నుంచి అసలామ్ సైక్లివాలా, సూరత్ నార్త్ నుంచి అశోక్ భాయ్ పటేల్, వాస్లత్ నుంచి కమల్ కుమార్ పటేల్ బరిలోకి దిగనున్నారు. గుజరాత్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అందుకే గెలుపు గుర్రాలే టికెట్ కేటాయించింది. ఆచి తూచి మరీ టికెట్ల కేటాయింపు చేసింది. గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ బీజేపీ అధికారం చేపడుతూ వస్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారం చేపట్టాలని అనుకుంటుంది.

గుజరాత్ అసెంబ్లీ నియోజకవర్గంలో 182 స్థానాలు ఉన్నాయి. రెండు విడతలుగా ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 1వ తేదీన 89 నియోజకవర్గాలకు 5 వ తేదీన 93 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. డిసెబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికలో ఆరో సారి గెలిచి.. అధికారం చేపడుతామని బీజేపీ ధీమాతో ఉంది. గుజరాత్ పోల్‌పై ఆప్ కూడా ఆశలు పెట్టుకుంది. అధికారం చేపడుతామని ధీమాతో ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము రేసులో ఉన్నామని చెబుతోంది. ఆ మేరకు ప్రచారం నిర్వహిస్తోంది.
વિધાસભાના કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી મેળવો તેવી શુભેચ્છાઓ.#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/EBH2dyGcRR
— Gujarat Congress (@INCGujarat) November 10, 2022
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications